కరోనాకు చంపే శక్తి లేదు: ఈటల
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్‌కు చంపే శక్తి లేదని 6 నెలల అనుభవంలో తెలిసిపోయిందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలతో మంత్రి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ.. హెల్త్ వారియర్స్ కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్నారని కొనియాడారు. అలాగే, కరోనాతో పాటు ఇతర వైద్య సేవలు అందించాలని మంత్రి సూచించారు. ఆశా వర్కర్లు, జీఎన్ఎంల జీతాల పెంపు పై సీఎం కేసీఆర్‌తో చర్చలు జరుపుతామని ఈటల హామీ […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్‌కు చంపే శక్తి లేదని 6 నెలల అనుభవంలో తెలిసిపోయిందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలతో మంత్రి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ.. హెల్త్ వారియర్స్ కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్నారని కొనియాడారు. అలాగే, కరోనాతో పాటు ఇతర వైద్య సేవలు అందించాలని మంత్రి సూచించారు. ఆశా వర్కర్లు, జీఎన్ఎంల జీతాల పెంపు పై సీఎం కేసీఆర్‌తో చర్చలు జరుపుతామని ఈటల హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో 99 శాతం మంది కరోనా నుంచి బయటపడుతున్నారని మంత్రి వివరణ ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడైనా కరోనాకు చికిత్స మాత్రం ఒక్కటే అని చెప్పారు. కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లి బాధితులు డబ్బులు ఖర్చు చేసుకోవద్దని ఆయన సూచించారు. సీజనల్ వ్యాధులు, కరోనా లక్షణాలుంటే టెస్టులు చేసి నిర్ధారించుకోవాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ఆశా వర్కర్లు, ఏన్ఎంలు ప్రజల్లో అవగాహన కల్పించాలని ఈటల రాజేందర్ ఆదేశించారు.