డాక్టర్లపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: ఈటల

దిశ, హైదరాబాద్: గాంధీ హాస్పిటల్‎లో డాక్టర్‎లపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి ఈటట రాజేందర్ అన్నారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితిలో క్షమించమని.. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతుంటే వారిని కొట్టడం ఏంటని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్స్ మీద దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. ఇలాంటి గంభీరమైన సమయంలో ఇలాంటి ఘటనలు మంచిది […]

Update: 2020-04-01 11:06 GMT

దిశ, హైదరాబాద్: గాంధీ హాస్పిటల్‎లో డాక్టర్‎లపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి ఈటట రాజేందర్ అన్నారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితిలో క్షమించమని.. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతుంటే వారిని కొట్టడం ఏంటని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్స్ మీద దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. ఇలాంటి గంభీరమైన సమయంలో ఇలాంటి ఘటనలు మంచిది కాదని చెప్పారు. 24 గంటలు డాక్టర్లు ప్రజల కోసం పని చేస్తున్నారని.. వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ప్రతి డాక్టర్‎కి రక్షణ కల్పిస్తామని.. భరోసాతో పని చేయాలని వైద్యులను కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని మంత్రి ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు.

Tags: minister etela rajendar, comments, attack on the doctors, hyderabad

Tags:    

Similar News