కేంద్రానికి మంత్రి ఎర్రబెల్లి లేఖ

దిశ,వెబ్‌డెస్క్: పెండింగ్‌లో ఉన్న రూ. 1024 కోట్లను వెంటనే విడుదల చేయాలని కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖను మంత్రి ఎర్రబెల్లి కోరారు. కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖకు మంత్రి ఎర్రబెల్లి ఆదివారం లేఖ రాశారు. ఉపాధి హామీ పెండింగ్ నిధులు విడుదల చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఉపాధి పని దినాల లక్ష్యాన్ని గడువులోపే సాధించామని పేర్కొన్నారు. 97.37శాతం లక్ష్య సాధనతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచామని తెలిపారు. ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రానికి […]

Update: 2020-12-20 06:59 GMT

దిశ,వెబ్‌డెస్క్: పెండింగ్‌లో ఉన్న రూ. 1024 కోట్లను వెంటనే విడుదల చేయాలని కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖను మంత్రి ఎర్రబెల్లి కోరారు. కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖకు మంత్రి ఎర్రబెల్లి ఆదివారం లేఖ రాశారు. ఉపాధి హామీ పెండింగ్ నిధులు విడుదల చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఉపాధి పని దినాల లక్ష్యాన్ని గడువులోపే సాధించామని పేర్కొన్నారు. 97.37శాతం లక్ష్య సాధనతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచామని తెలిపారు. ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రానికి అవార్డులు వచ్చాయని చెప్పారు. ఈ ఏడాది ఉపాధి హామీ కింద రూ.1719.25 కోట్లు రావాల్సి ఉందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి రూ.694.66 కోట్లు మాత్రమే వచ్చాయని వెల్లడించారు.

Tags:    

Similar News