మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేసి.. ఓ విషయం చెప్పారు

దిశ, వరంగల్: కూలీల‌ను రైతుల‌ను ఆదుకోవాల‌నే ల‌క్ష్యంతోనే సీఎం కేసీఆర్ ఉన్నార‌ని, అందుక‌నుగుణంగా ఉపాధి హామీ పనులు ఎక్కువ మందికి కల్పించాల‌ని చూస్తున్నట్లు రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. బుధవారం ప‌ర్వ‌త‌గిరిలో ఉపాధి హామీ ప‌నుల‌ను మంత్రి ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా వారు చేస్తున్న ప‌నులు, కూలీ, ఉపాధి వంటి విష‌యాల‌ను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారుల‌తో మాట్లాడి, ఏయే చోట్ల ఎలా ప‌నులు జ‌రుగుతున్నాయ‌నే విషయాలపై‌ ఆరా […]

Update: 2020-05-13 06:38 GMT

దిశ, వరంగల్: కూలీల‌ను రైతుల‌ను ఆదుకోవాల‌నే ల‌క్ష్యంతోనే సీఎం కేసీఆర్ ఉన్నార‌ని, అందుక‌నుగుణంగా ఉపాధి హామీ పనులు ఎక్కువ మందికి కల్పించాల‌ని చూస్తున్నట్లు రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. బుధవారం ప‌ర్వ‌త‌గిరిలో ఉపాధి హామీ ప‌నుల‌ను మంత్రి ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా వారు చేస్తున్న ప‌నులు, కూలీ, ఉపాధి వంటి విష‌యాల‌ను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారుల‌తో మాట్లాడి, ఏయే చోట్ల ఎలా ప‌నులు జ‌రుగుతున్నాయ‌నే విషయాలపై‌ ఆరా తీశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ క‌రోనా వైర‌స్ కార‌ణంగా లాక్ డౌన్ విధించాల్సి వ‌చ్చిందని, దీంతో మొత్తం పనుల‌న్నీ స్తంభించి, ఆర్థిక వ్య‌వ‌స్థ దెబ్బతిందన్నారు. అయిన‌ప్ప‌టికీ సీఎం కూలీల‌కు ఉపాధి క‌ల్పించాల‌ని చూస్తున్నార‌ని, అందుకే ఉపాధి కూలీ రేట్ల‌ను కూడా పెంచార‌న్నారు. అలాగే రైతాంగాన్ని ఆదుకోవాల‌నే ఉద్దేశంతో ప్ర‌తి గింజ‌ను ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేసే విధంగా చ‌ర్య‌లు తీసుకున్నార‌ని మంత్రి తెలిపారు. కూలీలు, రైతులు బాగుంటే దేశం, రాష్ట్రం బాగుంటుంద‌న్నారు. కొత్త కూలీల‌కు కూడా జాబ్ కార్డులు జారీ చేయాల‌ని ఆదేశించిన‌ట్లు మంత్రి కూలీల‌కు తెలిపారు. అంద‌రికీ ప‌ని క‌ల్పించాల‌ని చెప్పారు. లాక్ డౌన్ స‌మ‌యంలో స్వీయ నియంత్ర‌ణ‌, సామాజిక‌, భౌతిక దూరం పాటిస్తూ ప‌నులు చేయాల‌న్నారు. ఎండ‌లు త‌క్కువ‌గా ఉన్న స‌మ‌యాల్లోనే ప‌నులు చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

Tags:    

Similar News