ప్రజల్లో నమ్మకం కలిగించాలి: మంత్రి ఎర్రబెల్లి
దిశ, జనగామ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ వ్యాధిగ్రస్తులకు మెరుగైన సేవలందించి, ప్రజల్లో నమ్మకం కల్పించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్, ఎమ్మెల్యేలు, అధికారులతో కొవిడ్ నియంత్రణ చర్యలు, యాసంగి ధాన్య కొనుగోళ్లపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ పాజిటివ్ రేటు 20 శాతం ఉన్నట్లు, వైద్యాధికారులు, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి, కొవిడ్ మహమ్మారి నియంత్రణకై పనిచేయాలన్నా […]
దిశ, జనగామ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ వ్యాధిగ్రస్తులకు మెరుగైన సేవలందించి, ప్రజల్లో నమ్మకం కల్పించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్, ఎమ్మెల్యేలు, అధికారులతో కొవిడ్ నియంత్రణ చర్యలు, యాసంగి ధాన్య కొనుగోళ్లపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ పాజిటివ్ రేటు 20 శాతం ఉన్నట్లు, వైద్యాధికారులు, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి, కొవిడ్ మహమ్మారి నియంత్రణకై పనిచేయాలన్నా రు. జిల్లాలో పడకలు, ఆక్సిజన్, రెమిడిసివిర్ ఇంజెక్షన్ల కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు. ఆక్సిజన్ బెడ్లను పెంచడానికి వెంటనే చర్యలు చేపట్టామన్నారు. ప్రతి మండలంలో ఐసులేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి, అన్ని వసతులు కల్పించినట్లు ఎర్రబెల్లి చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో కలెక్టర్ కె నిఖిల, జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, జనగామ, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.