కిషన్ రెడ్డి యాత్రకు స్పందన లేదు.. మంత్రి ఎర్రబెల్లి కౌంటర్
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర వైఫల్యంతోనే తెలంగాణలో కరోనా మరణాలు సంభవించాయని ఆ మరణాలకు కేంద్రమే బాధ్యత వహించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. శనివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా సమయంలో తెలంగాణకు మందులు, వ్యాక్సిన్ ఇవ్వకపోవడం వల్లనే మరణాలు సంభవించాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ కొరత ఉంటే విదేశాలకు కేంద్రం అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. కరోనా కట్టడికి […]
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర వైఫల్యంతోనే తెలంగాణలో కరోనా మరణాలు సంభవించాయని ఆ మరణాలకు కేంద్రమే బాధ్యత వహించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. శనివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా సమయంలో తెలంగాణకు మందులు, వ్యాక్సిన్ ఇవ్వకపోవడం వల్లనే మరణాలు సంభవించాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ కొరత ఉంటే విదేశాలకు కేంద్రం అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. కరోనా కట్టడికి కేసీఆర్ తీసుకున్న చొరవను రాష్ట్ర విదేశాల్లో సైతం అభినందించారని పేర్కొన్నారు. కేంద్రమంత్రి హోదాలో ఉండి కిషన్ రెడ్డి అబద్ధాలు మానుకొని వాస్తవాలు మాట్లాడాలని సూచించారు. కేంద్రమంత్రిగా తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని హక్కులను కేంద్రం కాలరాసింది అని ధ్వజమెత్తారు.
తెలంగాణ నుంచి పన్నుల రూపంలో 2 లక్షల 70 వేల కోట్లు కేంద్రానికి అందజేస్తే తెలంగాణకు లక్షా 50 వేల కోట్లు మాత్రమే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రాలకు బడ్జెట్ ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. గుజరాత్ వంటి బీజేపీ పాలిత ప్రాంతాలలో వారు చెల్లించిన పన్నుల కన్నా ఎక్కువ బడ్జెట్ కేటాయించారని ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి వారు మాట్లాడే తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి హుందాగా మాట్లాడాలా తప్ప చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణ టూరిజం వెనుకబడిందని దాని అభివృద్ధికి చిత్తశుద్ధి ఉంటే నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బండి సంజయ్ మాటలతోనే హైదరాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా గెలుచుకో లేకపోయిందని ధ్వజమెత్తారు. అదేవిధంగా కార్పొరేషన్ కొడంగల్ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఓటమి పాలయ్యారు అని అన్నారు. ప్రతి కుటుంబాన్ని ఆదుకున్న ఘనత టీఆర్ఎస్ అని అన్నారు. కాజీపేట కోచ్గి, రిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజ్ అని అడుగుతే ఒక్కటి కూడా కేటాయించలేదని ఇప్పుడు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో బీజేపీ నేతలకు తెలియాలని ఆరోపించారు. తప్పుగా మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. నలుగురు ఎంపీలు ఒక కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణకు ఏం తీసుకొచ్చారు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. యాత్రలో అబద్ధాలు మానుకొని వాస్తవాలు మాట్లాడాలని సూచించారు. కిషన్ రెడ్డి చేపట్టిన యాత్ర ఫెయిల్యూర్ అని, ఆ యాత్రకు ప్రజల నుంచి స్పందన లేదని ఎద్దేవా చేశారు.