కరువు ప్రాంతాలకు నీరందిస్తాం : ఈటల
దిశ,. కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరువుతో అల్లాడుతున్న ప్రాంతాలను సస్యశామలం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.సోమవారం జిల్లాలోని చిగురుమామిడి, సైదాపూర్, తిమ్మాపూర్ మండలాల్లో ఆయన అధికారులతో కలిసి పర్యటించారు.ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ..మానకొండూర్, హుస్నాబాద్ నియోజకవర్గాలకు తప్పకుండా నీరందించి తీరుతామని తెలిపారు. మిడ్ మానేరు ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకు వరప్రదాయిని అని ఈటల గుర్తుచేశారు. గ్రావిటీ ద్వారా 70వేల […]
దిశ,. కరీంనగర్:
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరువుతో అల్లాడుతున్న ప్రాంతాలను సస్యశామలం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.సోమవారం జిల్లాలోని చిగురుమామిడి, సైదాపూర్, తిమ్మాపూర్ మండలాల్లో ఆయన అధికారులతో కలిసి పర్యటించారు.ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ..మానకొండూర్, హుస్నాబాద్ నియోజకవర్గాలకు తప్పకుండా నీరందించి తీరుతామని తెలిపారు. మిడ్ మానేరు ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకు వరప్రదాయిని అని ఈటల గుర్తుచేశారు. గ్రావిటీ ద్వారా 70వేల ఎకరాలకు నీరందించే గొప్ప పథకం కొన్ని అనుకోని కారణాల వలన ఆగిపోయిందని, తిరిగి రెండు నెలల్లో మిగిలిన కాలువలను పూర్తిచేసి సాగునీరు అందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.