పేద, వలస కూలీలెవరూ ఆకలితో ఉండొద్దు : మంత్రి సత్యవతి రాథోడ్
దిశ, వరంగల్: రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఎవరూ ఆకలితో ఉండొద్దని, నిరుపేదలు, వలస కూలీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..అత్యవసరమైతే తప్ప రోడ్ల మీదకు ఎవరూ రావొద్దని ప్రజలకు సూచించారు. రాష్ట్ర ప్రజలెవరూ ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు చేపట్టిందన్నారు. అనంతరం మహబూబాబాద్‌లోని వీధి బాలలు, వలస కూలీలకు మంత్రి రాథోడ్ […]
దిశ, వరంగల్: రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఎవరూ ఆకలితో ఉండొద్దని, నిరుపేదలు, వలస కూలీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..అత్యవసరమైతే తప్ప రోడ్ల మీదకు ఎవరూ రావొద్దని ప్రజలకు సూచించారు. రాష్ట్ర ప్రజలెవరూ ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు చేపట్టిందన్నారు. అనంతరం మహబూబాబాద్‌లోని వీధి బాలలు, వలస కూలీలకు మంత్రి రాథోడ్ దుస్తులు పంపిణీ చేశారు.
రాష్ట్రంలో కరోనా కట్టడికి అన్ని వర్గాల వారు సహకరిస్తున్న నేపథ్యంలో వలస కూలీలు, వీధి బాలలు, దినసరి కూలీలను ఆదుకునేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆమె కోరారు.
Tags: carona, minsiter satyavathi, clothes distributes, migrant labours