మహిళా బాక్సర్‌కు మంత్రి అభినందనలు
దిశ, స్పోర్ట్స్ : జూనియర్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్, ప్రస్తుతం 51 కేజీల సీనియర్ విభాగంలో రాణిస్తున్న ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్‌కు నాట్కో ఫార్మా ఆర్థిక సహాయం అందించింది. అంతర్జాతీయ స్థాయిలో 21వ ర్యాంక్ సాధించిన జరీన్.. మున్ముందు జరగబోయే పోటీలకు సిద్ధం కావడానికి రూ. 5 లక్షలను సీఎస్ఆర్ నిధుల నుంచి కేటాయించింది. దీనికి సంబంధించిన చెక్‌ను శనివారం తెలంగాణ క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి వీ. శ్రీనివాస్‌గౌడ్ ఆమెకు అందించారు. కాగా, […]
దిశ, స్పోర్ట్స్ : జూనియర్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్, ప్రస్తుతం 51 కేజీల సీనియర్ విభాగంలో రాణిస్తున్న ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్‌కు నాట్కో ఫార్మా ఆర్థిక సహాయం అందించింది. అంతర్జాతీయ స్థాయిలో 21వ ర్యాంక్ సాధించిన జరీన్.. మున్ముందు జరగబోయే పోటీలకు సిద్ధం కావడానికి రూ. 5 లక్షలను సీఎస్ఆర్ నిధుల నుంచి కేటాయించింది. దీనికి సంబంధించిన చెక్‌ను శనివారం తెలంగాణ క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి వీ. శ్రీనివాస్‌గౌడ్ ఆమెకు అందించారు. కాగా, తనకు క్రీడాకారుల కోటాలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని ఆమె మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఆమె విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన మంత్రి.. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొని వెళ్లానని హామీ ఇచ్చారు.