కరోనాపై మంత్రి జగదీశ్ రెడ్డి టెలీకాన్ఫరెన్స్
దిశ, నల్లగొండ : కరోనా మహమ్మారి ప్రబలుతున్ననేపథ్యంలో ఇప్పటి వరకు నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం జిల్లా వాసులు చేసుకున్న అదృష్టమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి మూడు జిల్లాల ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో నల్గొండ, సూర్యాపేటలతో పాటు భువననగిరి-యాదాద్రి జిల్లాల కలెక్టర్లు ప్రశాంత్ జీవన్ పాటిల్, వినయ్ కృష్ణారెడ్డి, అనితా రామచంద్రన్, ఎస్పీలు, ఏవీ రంగనాథ్, భాస్కరన్, భువనగిరి […]
దిశ, నల్లగొండ :
కరోనా మహమ్మారి ప్రబలుతున్ననేపథ్యంలో ఇప్పటి వరకు నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం జిల్లా వాసులు చేసుకున్న అదృష్టమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి మూడు జిల్లాల ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో నల్గొండ, సూర్యాపేటలతో పాటు భువననగిరి-యాదాద్రి జిల్లాల కలెక్టర్లు ప్రశాంత్ జీవన్ పాటిల్, వినయ్ కృష్ణారెడ్డి, అనితా రామచంద్రన్, ఎస్పీలు, ఏవీ రంగనాథ్, భాస్కరన్, భువనగిరి యాదాద్రి డీసీపీలు, 3జిల్లాల డీఎంహెచ్‌వోలు, ఉమ్మడి జిల్లాలోని ఆర్డీవోలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఉమ్మడి జిల్లా అధికారులు గృహనిర్బంధంలోకి తీసుకున్నప్పటికీ, నిన్నమొన్న వెలుగు చూసిన పరిణామాలు 3జిల్లాలను కొంత ఉలిక్కిపడేలా చేశాయన్నారు. అదృష్టం కొద్దీ ఢిల్లీలో జరిగిన ప్రార్ధనల్లో పాల్గొన్నవారికి నెగిటివ్ వచ్చిందన్నారు. అయినా వారందరినీ హోమ్ క్యారంటైన్‌లో పెట్టి వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఢిల్లీకి పోయి వచ్చిన వారిలో మరో10మందిని మిర్యాలగూడ ప్రాంతంలో గుర్తించి తమ పర్యవేక్షణలోనిక తీసుకున్నట్టు నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పటేల్ మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. అదే విధంగా కాలినడకన ఏపీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నవారిని సరిహద్దుల్లో నిలిపి, వసతి సౌకర్యంతో పాటు ఆహారం అందించినట్టు నల్గొండ ఎస్పీ రంగనాధ్ మంత్రికి వివరించారు. అనంతరం బత్తాయి, నిమ్మ రైతులకు వాహనాలు సమకూర్చడంలో అధికారులు చొరవ చూపాలని ఆయన ఆదేశించారు.
అదే సమయంలో బత్తాయి, నిమ్మలో వైరస్‌ను తట్టుకునే లక్షణాలు పుష్కలంగా ఉన్నందున ఎక్కువ శాతం జిల్లాలోని రైతు బజార్లకు, కూరగాయల మార్కెట్లకు తరలించే ఆలోచన చేయాలన్నారు. ఏప్రిల్ 14వరకు ప్రజలెవరూ బయటకు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
Tags: minister jagadeesh reddy teleconferance, nalgonda, carona