థియేటర్లో సోషల్ డిస్టెన్స్ కోసం మీనియన్స్
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కారణంగా మార్చి నుంచి చాలా దేశాల్లో లాక్‌డౌన్ అమల్లో ఉంది. అంతేకాదు సినిమా షూటింగ్‌లతో పాటు సినిమా థియేటర్లను కూడా మూసేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఇటీవలే పరిమిత సంఖ్యలో షూటింగ్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మళ్లీ సినిమా, సీరియల్ యూనిట్ల సందడి మొదలైంది. టీవీ సీరియళ్లు కూడా పున: ప్రారంభమయ్యాయి. కానీ థియేటర్లు ఓపెన్ కావడానికి కాస్త టైమ్ పట్టొచ్చు. అయితే ఫ్రాన్స్‌లో సోమవారం నుంచి థియేటర్లు తెరుచుకున్నాయి. […]
దిశ, వెబ్‌డెస్క్ :
కరోనా కారణంగా మార్చి నుంచి చాలా దేశాల్లో లాక్‌డౌన్ అమల్లో ఉంది. అంతేకాదు సినిమా షూటింగ్‌లతో పాటు సినిమా థియేటర్లను కూడా మూసేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఇటీవలే పరిమిత సంఖ్యలో షూటింగ్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మళ్లీ సినిమా, సీరియల్ యూనిట్ల సందడి మొదలైంది. టీవీ సీరియళ్లు కూడా పున: ప్రారంభమయ్యాయి. కానీ థియేటర్లు ఓపెన్ కావడానికి కాస్త టైమ్ పట్టొచ్చు. అయితే ఫ్రాన్స్‌లో సోమవారం నుంచి థియేటర్లు తెరుచుకున్నాయి.
లాక్‌డౌన్ నిబంధనల వల్ల ఓటీటీ, యూట్యూబ్‌లకే పరిమితమైన సినీ ప్రేక్షకులు.. మళ్లీ వెండితెరపై తమ అభిమాన నటుల కటౌట్లు చూసుకునేందుకు తెగ వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫ్రాన్స్ థియేటర్ యాజమాన్యాలు.. ప్రేక్షకుల కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. థియేటర్‌లో అడుగు పెట్టేముందు చేతులు కడుక్కునేందుకు శానిటైజర్ అందుబాటులో ఉంచారు. స్క్రీనింగ్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు. పారిస్‌లోని ఓ థియేటర్ యాజమాన్యం అయితే.. సోషల్ డిస్టెన్స్ మెయింటెయిన్ చేయడం కోసం సీట్ల మధ్య మీనియన్స్ బొమ్మలను అమర్చారు. కాగా వీటికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.