ఫ్లాష్ ఫ్లాష్ : TRSకు మరో కీలకనేత గుడ్ బై..

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్‌ఎస్ ​ప్రారంభం నుంచి పని చేస్తున్న కీలక నేత టీఆర్‌ఎస్‌కు గుడ్​బై చెప్పారు. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కనీస వేతనాల బోర్డు చైర్మన్​ సామ వెంకట్​రెడ్డి గులాబీని వీడి కాంగ్రెస్​పార్టీలో చేరుతున్నట్లు బుధవారం ప్రకటించారు. ఢిల్లీలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి​  మాణిక్కం ఠాగూర్‌ను టీపీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డితో పాటు కలిశారు. ఈ సందర్భంగా సామ వెంకట్​రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు లేవని, కేసీఆర్ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీని […]

Update: 2021-07-21 09:09 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్‌ఎస్ ​ప్రారంభం నుంచి పని చేస్తున్న కీలక నేత టీఆర్‌ఎస్‌కు గుడ్​బై చెప్పారు. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కనీస వేతనాల బోర్డు చైర్మన్​ సామ వెంకట్​రెడ్డి గులాబీని వీడి కాంగ్రెస్​పార్టీలో చేరుతున్నట్లు బుధవారం ప్రకటించారు. ఢిల్లీలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి​ మాణిక్కం ఠాగూర్‌ను టీపీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డితో పాటు కలిశారు.

ఈ సందర్భంగా సామ వెంకట్​రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు లేవని, కేసీఆర్ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదన్నారు. పిల్లలకు ఉద్యోగాలు రానప్పుడు ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు వస్తే ఏం లాభమని ప్రశ్నించారు. 33 జిల్లాల్లో తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘానికి కమిటీలు ఉన్నాయని, అందరినీ సంప్రదిస్తానని సామ వెంకట్​రెడ్డి ప్రకటించారు.

Tags:    

Similar News