బిహార్‌లో ఎంఐఎం జోరు
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌కే పరిమితం అనుకున్న ఎంఐఎం పార్టీ, దేశమంతటా దూసుకుపోతోంది. ప్రస్తుతం జరుగుతున్న బిహార్ ఎన్నికల్లో జోరు కనభరుస్తుంది. ఇప్పటి వరకూ జరిగిన కౌంటింగ్ ప్రకారం.. నాలుగు నియోజకవర్గాల్లో ఎంఐఎం అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అంతేగాకుండా ఇప్పటికే మహారాష్ట్రలో ఇద్దరు ఎమ్మెల్యేలను ఒక ఎంపీని గెలిపించుకున్న ఎంఐఎం తాము ఎక్కడైనా పోటీ చేయగలమని నిరూపించారు. ఇక బిహార్‌లో 2018లో జరిగిన ఉప ఎన్నికల్లో మొదటిసారిగా కిషన్‌గంజ్ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి గెలిచారు. దీంతో ఈ ఎన్నికల్లో […]
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌కే పరిమితం అనుకున్న ఎంఐఎం పార్టీ, దేశమంతటా దూసుకుపోతోంది. ప్రస్తుతం జరుగుతున్న బిహార్ ఎన్నికల్లో జోరు కనభరుస్తుంది. ఇప్పటి వరకూ జరిగిన కౌంటింగ్ ప్రకారం.. నాలుగు నియోజకవర్గాల్లో ఎంఐఎం అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అంతేగాకుండా ఇప్పటికే మహారాష్ట్రలో ఇద్దరు ఎమ్మెల్యేలను ఒక ఎంపీని గెలిపించుకున్న ఎంఐఎం తాము ఎక్కడైనా పోటీ చేయగలమని నిరూపించారు. ఇక బిహార్‌లో 2018లో జరిగిన ఉప ఎన్నికల్లో మొదటిసారిగా కిషన్‌గంజ్ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి గెలిచారు. దీంతో ఈ ఎన్నికల్లో ఎంఐఎం ప్రభావం బాగానే ఉంటుందని, 3-6 స్థానాల్లో గెలవొచ్చనే ఊహాగాణలు వచ్చాయి. తుది ఫలితాలు వచ్చే సరికి ఈ ఫలితాలు ఎలా ఉంటాయనేది చూడాలి మరి.