కరోనా ప్రభావం.. వాటికే ప్రాధాన్యతను ఇస్తున్న ప్రజలు

దిశ, తెలంగాణ బ్యూరో:  కరోనా తర్వాత ప్రజల ఆహరపు అలవాట్లలో మార్పులు వచ్చాయి. ఆరోగ్యవంతంగా ఉండేందుకు అత్యధికంగా మంది మిల్లెట్స్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఇక్రిసాట్(ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ది సెమీ అరిడ్ ట్రాఫిక్స్ ) సర్వేలో తేలింది. అందులో సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు, జొన్నలు, ఊదాలు(బార్న్యార్డ్ మిల్లెట్ ), వరిగలు, అరికెలు వంటివి అత్యధికంగా తింటున్నారు. మరోవైపు మధుమేహం, ఊబకాయం సమస్యలున్నోళ్లు తప్పనిసరిగా వీటికి ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులు కూడా సూచించడంతో […]

Update: 2021-08-29 22:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా తర్వాత ప్రజల ఆహరపు అలవాట్లలో మార్పులు వచ్చాయి. ఆరోగ్యవంతంగా ఉండేందుకు అత్యధికంగా మంది మిల్లెట్స్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఇక్రిసాట్(ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ది సెమీ అరిడ్ ట్రాఫిక్స్ ) సర్వేలో తేలింది. అందులో సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు, జొన్నలు, ఊదాలు(బార్న్యార్డ్ మిల్లెట్ ), వరిగలు, అరికెలు వంటివి అత్యధికంగా తింటున్నారు. మరోవైపు మధుమేహం, ఊబకాయం సమస్యలున్నోళ్లు తప్పనిసరిగా వీటికి ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులు కూడా సూచించడంతో జనాలు మిల్లెట్స్ పై ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ చిరుధాన్యాల వినియోగం ఎక్కువగా పట్టణాలకే పరిమితమవున్నది.

15,500 శాంపిల్స్ పై పరిశోధన..

మిల్లెట్స్ వినియోగంపై ఇక్రిసాట్ 2017లో సర్వేను షురూ చేసింది. వివిధ రాష్ట్రాల్లో సుమారు 15,500 మందిపై అధ్యయనం నిర్వహించింది. ప్రతీ రోజు మిల్లెట్స్ తీసుకుంటున్న వారిపై వివిధ అంశాలను ఆధారంగా వివరాలు సేకరించింది. దీనిలో 58 శాతం మంది ఆరోగ్యంగా ఉండేందుకు, మరో 15 శాతం మంది బరువును తగ్గేందుకు తీసుకుంటున్నట్లు వెల్లడైంది. వీరిలో 38 శాతం మంది మారుతున్న జీవనవిధానంతో పాటు ఆహార అలవాట్లని మార్చేందుకు తింటున్నట్లు స్పష్టం చేసింది. అయితే రూరల్ లో పోల్చితే అర్బన్ లోనే వీటి వినియోగం ఎక్కువగా ఉన్నది. పట్టణాల్లో అన్ని రకాల చిరుధాన్యాలు అందుబాటులో ఉండటంతో అర్బన్ ప్రజలకు వీటి సేకరణ సులువుగా ఉందని, తద్వారా వీటి వినియోగం పెరిగిందని ఇక్రిసాట్ పేర్కొన్నది. అంతేగాక మిగతా వారితో పోల్చితే వీటి వల్ల కలిగే ఉపయోగాలు సిటీ జనానికి ఎక్కువగా అవగాహన ఉన్నట్లు గుర్తించారు. మిల్లెట్స్ తినడం వల్ల కలిగే లాభాలను సోషల్ మీడియా, ఫ్యామిలీ ఫ్రెండ్స్, డాక్టర్ లు చెప్పడంతో అత్యధిక మంది తింటున్నట్లు ఇక్రిసాట్ గుర్తించింది.

ఎన్‌ఎఫ్‌హెచ్ఎస్ హెచ్చరిక..

గ్రామీణుల్లో రక్తహీనత సమస్య వెంటాడుతుందని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే పదే పదే చెబుతున్నా, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యశాఖ దృష్టిసారించడం లేదు. ముఖ్యంగా మహిళల్లో నెలకొన్న ఈ సమస్యను నివారించేందుకు చర్యలు తీసుకోలేదు. చిరుధాన్యాల వల్ల దీనిని నివారించవచ్చని ఎన్‌ఎఫ్‌హెచ్ఎస్ సూచించింది. గ్రామాల్లోనే పండించే చిరుధాన్యాలపై అవగాహన లేకనే వారు తీసుకోవడం లేదన్నది. దీంతో గ్రామాల్లో పోషకాహర లోపం వెంటాడుతోంది. అంతేకాకుండా అన్ని ధాన్యాలు దొరకకపోవడం కూడా తినకపోవడానికి కారణం అని సర్వేలో వెల్లడైంది. మిల్లెట్స్ ను గ్రామాల్లోనూ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే గ్రామీణులు తినేందుకు అవకాశం ఉంటుంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇక్రిసాట్ సైంటిస్టులు వెల్లడించారు.

Tags:    

Similar News