ఢిల్లీలో స్వల్ప భూకంపం
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆదివారం సాయంత్రం స్వల్పంగా భూమి కంపించింది. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ సరిహద్దుల్లో దీని కేంద్రాన్ని గుర్తించారు. కాగా, ఈ భూకంప తీవ్రతను రిక్టర్ స్కేల్‌పై 3.5గా నమోదైనట్టు ఓ అధికారి తెలిపారు. ఢిల్లీ, ఎన్‌సీఆర్ రీజియన్‌లో కంపనాలు చోటుచేసుకున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ సేస్మాలజీ ప్రకారం.. సాయంత్రం 5.45గంటలకు ఈ కంపనం జరిగింది. ఈ కంపనాలు కొన్ని సెకన్‌ల మేరకు కొనసాగినట్టు తెలిసింది. ఈ పరిణామంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినట్టయితే ఎటువంటి […]
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆదివారం సాయంత్రం స్వల్పంగా భూమి కంపించింది. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ సరిహద్దుల్లో దీని కేంద్రాన్ని గుర్తించారు. కాగా, ఈ భూకంప తీవ్రతను రిక్టర్ స్కేల్‌పై 3.5గా నమోదైనట్టు ఓ అధికారి తెలిపారు. ఢిల్లీ, ఎన్‌సీఆర్ రీజియన్‌లో కంపనాలు చోటుచేసుకున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ సేస్మాలజీ ప్రకారం.. సాయంత్రం 5.45గంటలకు ఈ కంపనం జరిగింది. ఈ కంపనాలు కొన్ని సెకన్‌ల మేరకు కొనసాగినట్టు తెలిసింది. ఈ పరిణామంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినట్టయితే ఎటువంటి రిపోర్టులు రాలేవు. ఢిల్లీలో స్వల్ప భూకంపం సంభవించిందని సీఎం కేజ్రీవాల్ పేర్కొంటూ.. ఈ నగర వాసులందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తున్నట్టు ఓ ట్వీట్ చేశారు.
tags.. earthquake, delhi, ncr region, mild, richter scale, 3.5