పొట్టకూటికి ఎంత కష్టం..

దిశ, న్యూస్‌బ్యూరో: ‘ఫోటోలో కనిపిస్తున్న ఈ నలుగురు.. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వలస కూలీలు. కూకట్‌పల్లిలోని ఓ బిల్డింగ్ పనుల కోసం నాలుగు నెలల కిందటే నగరానికి వచ్చి సైట్‌లోనే ఉంటూ పనులు చేస్తున్నారు. బిల్డింగ్ నిర్మాణం జరిగేటపుడు వారికి అవసరమైన బియ్యం, కూరగాయలు, వంట సరుకులన్నీ వారిని తీసుకొచ్చిన ఏజెంట్లే చూసుకునేవారు. అయితే, లాక్‌డౌన్ తర్వాత వారివద్దకు ఎవరూ రాలేదు. ఉన్న డబ్బులు, సరుకులతోనే ఇన్ని రోజులు గడిపారు. ఇప్పుడు వారి వద్ద తినడానికి ఏమీలేదు. […]

Update: 2020-04-23 09:06 GMT

దిశ, న్యూస్‌బ్యూరో:
‘ఫోటోలో కనిపిస్తున్న ఈ నలుగురు.. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వలస కూలీలు. కూకట్‌పల్లిలోని ఓ బిల్డింగ్ పనుల కోసం నాలుగు నెలల కిందటే నగరానికి వచ్చి సైట్‌లోనే ఉంటూ పనులు చేస్తున్నారు. బిల్డింగ్ నిర్మాణం జరిగేటపుడు వారికి అవసరమైన బియ్యం, కూరగాయలు, వంట సరుకులన్నీ వారిని తీసుకొచ్చిన ఏజెంట్లే చూసుకునేవారు. అయితే, లాక్‌డౌన్ తర్వాత వారివద్దకు ఎవరూ రాలేదు. ఉన్న డబ్బులు, సరుకులతోనే ఇన్ని రోజులు గడిపారు. ఇప్పుడు వారి వద్ద తినడానికి ఏమీలేదు. దీంతో హయత్ నగర్‌‌లో ఉన్న తమ సొంత ప్రాంతవాసులతో ఉండేందుకు ఇలా రాత్రిపూట వెళ్తున్నారు. వాహనాలు తిరగకపోవడం, ఏజెంట్ కూడా వీరిని పట్టించుకోకపోవడంతో 35 కిలోమీటర్ల దూరం ఇలా ఖాళీనడకన వెళ్తున్నారు. ఉదయం పూట అయితే పోలీసులు చెక్‌ పోస్టుల్లో అడ్డుకుని ఎక్కడికో తీసుకెళ్తుండటంతో రాత్రిపూట బయలుదేరాం’ అని వలస కూలీ ధర్మేందర్ భూపాల్ వివరించాడు.
‘వలస కార్మికులంతా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములే.. వారికి ఏ కష్టం రాకుండా కడుపులో పెట్టుకుని చూసుకుంటాం’ అని సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలు.. కానీ, లాక్‌డౌన్ ప్రకటించిన నెల రోజుల తర్వాత కూడా వలస కూలీలకు ఆకలి తిప్పలు తప్పడం లేదు. భవన నిర్మాణ కార్మికులకు పని ప్రదేశాల్లో ఆహారాన్ని అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం, జీహెచ్ఎంసీ చెబుతున్నాయి. అయితే తిండి దొరక్క, వసతి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులు రాత్రిపూట నగరం ఆ మూల నుంచి ఈ మూలకు ఖాళీ నడకన వెళ్తున్నారు.

అధికారిక లెక్కల ప్రకారం..

జీహెచ్ఎంసీ పరిధిలోని 208 నిర్మాణ ప్రాంతాల్లో 32,008 మంది భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం భోజన వసతి కల్పించింది. కొన్ని చోట్ల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్వయంగా వెళ్లి కార్మికులతో మాట్లాడారు కూడా. నగరంలో మొత్తం 43,704 మంది వలస కూలీలు ఉన్నట్టు గుర్తించిన జీహెచ్ఎంసీ 39,704 మందికి రేషన్ బియ్యం, డబ్బులు అందజేశామని చెబుతోంది. అడ్డాకూలీలు, దినసరి కూలీలు ఈ లెక్కల్లో లేరు. ఇతర రాష్ట్రాలకు చెందిన భవన నిర్మాణ రంగ వలస కార్మికుల బాధ్యతను వారి బిల్డర్లకే అప్పజెప్పామని, మిగిలిన వారికి తాత్కాలిక షెల్టర్ల ద్వారా భోజనాన్ని అందిస్తున్నామని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. కానీ ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు మాత్రం పని ప్రదేశంలో తినడానికి ఏమీ దొరకడం లేదని తమకు తెలిసిన వారి వద్దకు, ఇతర ప్రాంతాల్లో ఉన్న తమ వారి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

Tags: GHMC, KCR, migrant Labour, KCR, Lockdown, corona

Tags:    

Similar News