బతుకు దెరువు కోసం వచ్చి..బతుకు భారమై
దిశ, వరంగల్ బతుకు దెరువు కోసం వరంగల్ జిల్లాకు వలసొచ్చిన కూలీల జీవితం భారంగా మారింది. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో వారు ఉపాధి కోల్పొయారు.దీంతో స్థానికంగా ఉండలేక , సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరికొన్ని రోజులు పరిస్థితి ఇలానే ఉంటే ఆకలి చావులు చూడాల్సి వస్తుందని గ్రహించిన కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడింది.ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.పోలీసుల […]
దిశ, వరంగల్
బతుకు దెరువు కోసం వరంగల్ జిల్లాకు వలసొచ్చిన కూలీల జీవితం భారంగా మారింది. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో వారు ఉపాధి కోల్పొయారు.దీంతో స్థానికంగా ఉండలేక , సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరికొన్ని రోజులు పరిస్థితి ఇలానే ఉంటే ఆకలి చావులు చూడాల్సి వస్తుందని గ్రహించిన కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడింది.ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం..బీహార్‌కు చెందిన వలస కూలీ దంపతులు వరంగల్ శివారులోని గొర్రెకుంట గ్రామానికి వచ్చి స్థానికంగా ఉన్న ఓ కంపెనీలో పనిచేస్తూ జీవనం గడుపుతున్నారు.వీరికి ఇద్దరు పిల్లలు. లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక సమస్యలు వారిని వెంటాడాయి. దీంతో స్థానికంగా గల సుప్రియ కోల్డ్ స్టోరేజ్‌కు ఎదురుగా గల బావిలో దూకి వలస కూలీ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఘటనా స్థలికి చేరుకున్నగీసుగొండ పోలీసులు మృత దేహాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.