తెలంగాణకు చేరుకున్న బీహార్ హమాలీలు

దిశ, రంగారెడ్డి: బీహార్‌కు చెందిన 225 మంది హమాలీలు బుధవారం శ్రామిక్ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌కు చేరుకున్నారు. వీరికి లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో మంత్రి గంగుల కమలాకర్ పుష్పాలతో స్వాగతం పలికారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వేర్వేరు బస్సుల్లో నల్గొండ, మిర్యాలగూడ, కరీంనగర్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంచిర్యాల, సిద్దిపేట జిల్లాలకు తరలించారు. వీరు ఆయా జిల్లాల్లోని రైస్ మిల్లుల్లో పనిచేయడానికి వచ్చారని మంత్రి తెలిపారు. మంత్రి గంగుల వెంట రాష్ట్ర ప్రభుత్వ నోడల్ అధికారి […]

Update: 2020-05-08 05:38 GMT

దిశ, రంగారెడ్డి: బీహార్‌కు చెందిన 225 మంది హమాలీలు బుధవారం శ్రామిక్ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌కు చేరుకున్నారు. వీరికి లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో మంత్రి గంగుల కమలాకర్ పుష్పాలతో స్వాగతం పలికారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వేర్వేరు బస్సుల్లో నల్గొండ, మిర్యాలగూడ, కరీంనగర్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంచిర్యాల, సిద్దిపేట జిల్లాలకు తరలించారు. వీరు ఆయా జిల్లాల్లోని రైస్ మిల్లుల్లో పనిచేయడానికి వచ్చారని మంత్రి తెలిపారు. మంత్రి గంగుల వెంట రాష్ట్ర ప్రభుత్వ నోడల్ అధికారి సందీప్‌‌కుమార్ సుల్తానియా, కలెక్టర్ అమోయ్ కుమార్, అదనపు కలెక్టర్ హరీశ్, సైబరాబాద్ సీపీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Migrant laborers, Return, hyderabad

Tags:    

Similar News