Hydra: ఎనిదేండ్ల క్రితమే ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ఫిక్స్.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ
శేరిలింగంపల్లి మండలంలోని ఖాజాగూడ - నానక్‌రామ్ గూడ ప్రధానమార్గానికి ఇరువైపులా ఉన్న తౌతాని కుంట, భగీరథమ్మ చెరువుల ఆక్రమణలతో పరిసరప్రాంతాలను వరద నీరు ముంచెత్తుతోందని స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) తెలిపారు.
దిశ, తెలంగాణ బ్యూరో: శేరిలింగంపల్లి మండలంలోని ఖాజాగూడ - నానక్‌రామ్ గూడ ప్రధానమార్గానికి ఇరువైపులా ఉన్న తౌతాని కుంట, భగీరథమ్మ చెరువుల ఆక్రమణలతో పరిసరప్రాంతాలను వరద నీరు ముంచెత్తుతోందని స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) తెలిపారు. తౌతాని కుంట, భగీరథమ్మ చెరువుల ఆక్రమణల తొలగింపు విషయంలో వస్తున్న విమర్శలకు రంగనాథ్ బుధవారం వాస్తవాలను వివరించారు. ఫిర్యాదుల పరిశీలనకు జీహెచ్ఎంసీ(GHMC), హెచ్ఎండీఏ(HMDA), రెవెన్యూ(Revenue), ఇరిగేషన్(Irrigation) శాఖలకు చెందిన అధికారులతో కలసి తానున స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడే ఉన్న వారిని విచారించినట్టు తెలిపారు. కూల్చివేతలకు సంబంధించిన అంశాన్ని కూడా తెలియజేశారు.
తౌటొనికుంట, భగీరతమ్మ చెరువులకు ఎనిమిదేండ్ల క్రితమే ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించడానికి ఫ్రిలిమినరీ, ఫైనల్ నోటీఫికేషన్స్ ఇచ్చిన ఫిక్స్ చేశారని హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ తెలిపారు. దీంతోపాటు 28డిసెంబర్ 2024న బుద్ధభవన్ లోని హైడ్రా ప్రధాన కార్యాలయంలో వాణిజ్యదుకాణాల ఓనర్లు, రియల్ ఎస్టేట్ డవలపర్స్, శిఖం పట్టదార్లతో సమావేశం ఏర్పాటు చేసి సమావేశంలో ఎఫ్‌టిఎల్/బఫర్ జోన్ సరిహద్దులను స్పష్టంగా పేర్కొంటూ తౌతాని కుంట, భగీరథమ్మచెరువులో జరిగిన ఆక్రమణల గురించి స్క్రీన్‌పై గూగుల్ ఎర్త్‌లో స్పష్టంగా హైడ్రా అధికారులు వివరించారని తెలిపారు. అందుకు అందురూ అంగీకరించారని తెలిపారు. ఏస్ కార్పొ గ్రూపు ఈ మధ్యకాలంలో 7ఎకరాల భూమిని శిఖం పట్టదారు మేకల అంజయ్య, ఇతరల నుంచి తీసుకుని నిర్మాణాలు చేపట్టడంతోనే హైడ్రా కూల్చివేతలు చేపట్టిందని తెలిపారు. దీనిపై సదరు రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్ సైతం హైడ్రా కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి హజరయ్యారని గుర్తుచేశారు. అయినా కూల్చివేతలపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. భగీరథమ్మ చెరువులో మట్టిపోసిన సంధ్య కన్ స్ట్రక్షన్ ఓనర్ శ్రీధర్ రావుపై రాయదుర్గం పోలీసు స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదు చేశామని తెలిపారు. వైన్ షాపు తొలగించకుండా ఇతర షాపులను తొలగించారని వస్తున్న ఆరోపణల్లో వాస్తవంలేదన్నారు. వైన్ షాపుకు ప్రభుత్వం లైసెన్స్ జారీచేసిందని, ఈ షాపు వేరే ప్రాంతానికి మార్చాలని ఎక్సైజ్ శాఖను కోరినట్టు తెలిపారు. వైన్ షాపుకు అనుబంధంగా షాపులను సైతం తొలగించామని చెప్పారు. క్లుప్తంగా చెప్పాలంటే, శిఖం పట్టాదార్లు మేకల అంజయ్యతో పాటు ఇతరులు సరస్సు బఫర్ జోన్‌లో దుకాణాలు నడుపుతున్నారని, సరస్సు నిర్మాణ శిధిలాలతో నింపడంతోపాటు రియల్ ఎస్టేట్ కంపెనీలతో అభివృద్ధి ఒప్పందం కూడా చేసుకున్నారని తెలిపారు. ఇలాంటి విధానాలనే నీటి వనరుల ఆక్రమణదారులందరూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.
వారం రోజుల ముందుగానే సమావేశాలు నిర్వహించి, 3-4 రోజుల తర్వాత ఆక్రమణలను కూల్చివేస్తామని ముందుగానే హైడ్రా హెచ్చరించిందని, ఎఫ్టీఎల్/ బఫర్ జోన్‌లోని స్థలాలను ఖాళీ చేయమని కూడా హైడ్రా చెప్పిందని వివరించారు. హెచ్చరించిన తర్వాత కూడా ఎవరూ స్థలాలను/ ఆక్రమణలను ఖాళీ చేయలేదని, డిసెంబరు 30న వారికి ఖాళీ చేయడానికి 24 గంటల సమయం ఇస్తూ మళ్లీ రాతపూర్వక సెలవు నోటీసులు అందజేసినట్టు తెలిపారు. ఎవరూ ఖాళీ చూయకపోవడంతోనే 31 డిసెంబర్ 2024న ఎఫ్‌టిఎల్/బఫర్ జోన్‌లైన భగీరథమ్మ చెరువు, తౌతానికుంటలో ఆక్రమణలను హైడ్రా తొలగించిందని చెప్పారు. జీహెచ్ఎంసీ చట్టం సెక్షన్ 405ప్రకారం వాటర్‌బాడీస్‌లో నిర్మాణాలు వచ్చినట్లయితే నోటీసు జారీ చేయవలసిన అవసరం లేదని స్పష్టత ఇచ్చారు.