ఫ్లైట్‌లో మిడిల్ సీట్ ఖాళీగానే ఉంచండి: డీజీసీఏ

న్యూఢిల్లీ: వీలైనంత మటుకు విమానాల్లో మిడిల్ సీట్ ఖాళీగానే ఉంచాలని విమాన సంస్థలకు ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఈ సీటు ఖాళీగా ఉంచితే ప్రయాణికులపై భారం పడుతుందని, టికెట్ ఛార్జీలు పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. తాజాగా, విమాన ప్రయాణాల్లో మధ్య సీటు ఖాళీగానే ఉంచాలని డీజీసీఏం ఆర్డర్ వేసింది. ఒకవేళ మధ్యసీటును కూడా కేటాయిస్తే.. సదరు ప్రయాణికుడికి అదనపు భద్రత(జౌళీ శాఖ ప్రమాణాలకు అనుగుణంగా […]

Update: 2020-06-01 04:45 GMT

న్యూఢిల్లీ: వీలైనంత మటుకు విమానాల్లో మిడిల్ సీట్ ఖాళీగానే ఉంచాలని విమాన సంస్థలకు ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఈ సీటు ఖాళీగా ఉంచితే ప్రయాణికులపై భారం పడుతుందని, టికెట్ ఛార్జీలు పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. తాజాగా, విమాన ప్రయాణాల్లో మధ్య సీటు ఖాళీగానే ఉంచాలని డీజీసీఏం ఆర్డర్ వేసింది. ఒకవేళ మధ్యసీటును కూడా కేటాయిస్తే.. సదరు ప్రయాణికుడికి అదనపు భద్రత(జౌళీ శాఖ ప్రమాణాలకు అనుగుణంగా ప్రయాణికుడిని చుట్టేసి ఉండే గౌన్‌లాంటివి) ఏర్పాటు చేయాలని తెలిపింది. లాక్‌డౌన్ కారణంగా రద్దయిన దేశీయ విమాన సేవలను రెండు నెలల కాలం తర్వాత మే 25వ తేదీన కేంద్రం పున:ప్రారంభించింది. అంతర్జాతీయ విమాన సేవలు ఇంకా సస్పెన్షన్‌లోనే ఉన్నాయి.

Tags:    

Similar News