మైక్రోసాఫ్ట్‌లో శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం! జీతాల్లోనూ మార్పులు!

మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పించేందుకు సంస్థ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా మీడియాలో  కథనాలు ప్రచురితమయ్యాయి. కరోనా సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.అమెరికాలో అధిక శాతం మైక్రోసాఫ్ట్ కార్యాలయాలు ఇప్పటికీ తెరుచుకోలేదు. వచ్చే ఏడాది జనవరిలోనే కార్యాలయాలు పూర్తి స్థాయిలో తెరుచుకునే అవకాశం ఉంది. ఆ సందర్భంగా ఇంటిని నుంచే పనిచేద్దామనుకుంటున్న ఉద్యోగులకు శాశ్వతంగా ఆ సౌలభ్యాన్ని కల్పించేందుకు మైక్రోసాఫ్ట్ నిర్ణయించింది. అయితే..ఆయా ఉద్యోగులు […]

Update: 2020-10-10 02:53 GMT

మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పించేందుకు సంస్థ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. కరోనా సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.అమెరికాలో అధిక శాతం మైక్రోసాఫ్ట్ కార్యాలయాలు ఇప్పటికీ తెరుచుకోలేదు. వచ్చే ఏడాది జనవరిలోనే కార్యాలయాలు పూర్తి స్థాయిలో తెరుచుకునే అవకాశం ఉంది. ఆ సందర్భంగా ఇంటిని నుంచే పనిచేద్దామనుకుంటున్న ఉద్యోగులకు శాశ్వతంగా ఆ సౌలభ్యాన్ని కల్పించేందుకు మైక్రోసాఫ్ట్ నిర్ణయించింది. అయితే..ఆయా ఉద్యోగులు కార్యాలయంలోని తన వర్క్ స్పేస్‌ను వదులుకోవాల్సి ఉంటుంది.తాజా లెక్కల ప్రకారం మైక్రోసాఫ్ట్‌లొ మొత్తం 1.63 లక్షల మంది పనిచేస్తుండగా వారిలో 96 వేల మంది అమెరికాలోనే విధులు నిర్వర్తిస్తున్నారు.

Tags:    

Similar News