మైక్రోప్లాస్టిక్స్ : 89% అధ్యయన బృందం ఓడ నుంచి వచ్చినవే!

దిశ, ఫీచర్స్ : మైక్రో ప్లాస్టిక్ పర్యావరణ సమస్యగా మారింది. సముద్రపు జీవులు ఇలాంటి సూక్ష్మ కణాలు మింగేయడం వలన తీవ్రంగా గాయపడటంతో పాటు ప్రాణాలు కోల్పోతున్నాయి. మనుషులు ఎక్కువగా సంచరించని రిమోట్ ఏరియాల్లో సైతం మైక్రో ప్లాస్టిక్ ముప్పు అధికంగా ఉండగా.. అంటార్కిటికాలో దీనిపై తాజాగా జరిపిన పరిశోధన షాకింగ్ విషయాలను వెలుగులోకి తెచ్చింది.   ఈ రకమైన కాలుష్యాన్ని గుర్తించేందుకు, ఈ సూక్ష్మ కణాలు ఎక్కడ నుంచి ఉద్భవించాయో తెలుసుకునేందుకు.. బాసెల్ విశ్వవిద్యాలయంలోని పర్యావరణ శాస్త్ర […]

Update: 2021-12-13 09:50 GMT

దిశ, ఫీచర్స్ : మైక్రో ప్లాస్టిక్ పర్యావరణ సమస్యగా మారింది. సముద్రపు జీవులు ఇలాంటి సూక్ష్మ కణాలు మింగేయడం వలన తీవ్రంగా గాయపడటంతో పాటు ప్రాణాలు కోల్పోతున్నాయి. మనుషులు ఎక్కువగా సంచరించని రిమోట్ ఏరియాల్లో సైతం మైక్రో ప్లాస్టిక్ ముప్పు అధికంగా ఉండగా.. అంటార్కిటికాలో దీనిపై తాజాగా జరిపిన పరిశోధన షాకింగ్ విషయాలను వెలుగులోకి తెచ్చింది.

ఈ రకమైన కాలుష్యాన్ని గుర్తించేందుకు, ఈ సూక్ష్మ కణాలు ఎక్కడ నుంచి ఉద్భవించాయో తెలుసుకునేందుకు.. బాసెల్ విశ్వవిద్యాలయంలోని పర్యావరణ శాస్త్ర విభాగం, హెల్మ్‌హోల్ట్‌జ్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ మెరైన్ రీసెర్చ్‌లోని ఆల్ఫ్రెడ్-వెజెనర్ ఇన్‌స్టిట్యూట్(AWI) పరిశోధనా బృందం అంటార్కిటికా సముద్రపు నీటిని పరిశీలించింది.

ఈ మేరకు పోలార్‌స్టెర్న్ అనే పరిశోధనా నౌకతో 2018, 2019 సంవత్సరాల్లో రెండు పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు.. 34 సర్ఫేస్ వాటర్ శాంపిల్స్, 79 సబ్ సర్ఫేస్ వాటర్ శాంపిల్స్ సేకరించారు. మొత్తం ఎనిమిది మిలియన్ లీటర్ల సముద్రపు నీటిని జల్లెడ పట్టి అందులో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్లు గుర్తించారు. వీటిలో 47% కణాలు మెరైన్ పెయింట్‌లో బైండింగ్ ఏజెంట్‌గా ఉపయోగించగల ప్లాస్టిక్స్‌తో కూడి ఉన్నాయని కనుగొన్నారు. అంటే మెరైన్ పెయింట్, షిప్పింగ్ ట్రాఫిక్ అనేది దక్షిణ మహాసముద్రంలో మైక్రోప్లాస్టిక్స్‌కు ప్రధాన మూలమని నిర్ధారించారు.

ఇక మిగిలిన మైక్రో ప్లాస్టిక్ కణాలు పాలీప్రొఫైలిన్, పాలీ ఎథిలిన్ అండ్ పాలీ అమైడ్‌లుగా గుర్తించబడగా.. ఇవి ఫిషింగ్ నెట్‌లు, ప్యాకేజింగ్ మెటీరియల్స్‌లో ఉపయోగించబడతాయి. ఫైనల్‌గా వీటిలో 89% మైక్రో ప్లాస్టిక్స్ తమ సొంత ఓడలోని పెయింట్ నుంచి వచ్చినట్లు పరిశోధకులు కనుగొన్నారు.

Tags:    

Similar News