ట్రెండింగ్‌లో ‘బిందీ’ చాలెంజ్

దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి కట్టడికి విధించిన లాక్‌డౌన్ వేళ.. ఇంటర్నెట్‌లో ఎన్నో రకాల చాలెంజ్‌లు పుట్టుకొచ్చిన విషయం తెలిసింది. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు..ఆయా చాలెంజ్‌లు స్వీకరించి వాటిని ట్రెండింగ్‌లో నిలిపారు. అందులో ‘సారీ చాలెంజ్’ నారీమణుల మదిని దోచుకుంది. బుల్లితెర నటులు, వెండితెర తారలు ఎంతోమంది ఇందులో పార్టిసిపేట్ చేసి తమ చీరలోని హుందాతనాన్ని, అందాన్ని ప్రదర్శించారు. సంప్రదాయ సౌరభాన్ని తెలిపారు. ఇప్పుడు మైక్రోబ్లాగింగ్ ట్విట్టర్ పిట్ట సాక్షిగా ‘మహిళలు’ మరో చాలెంజ్‌కు […]

Update: 2020-08-28 03:10 GMT

దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి కట్టడికి విధించిన లాక్‌డౌన్ వేళ.. ఇంటర్నెట్‌లో ఎన్నో రకాల చాలెంజ్‌లు పుట్టుకొచ్చిన విషయం తెలిసింది. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు..ఆయా చాలెంజ్‌లు స్వీకరించి వాటిని ట్రెండింగ్‌లో నిలిపారు. అందులో ‘సారీ చాలెంజ్’ నారీమణుల మదిని దోచుకుంది. బుల్లితెర నటులు, వెండితెర తారలు ఎంతోమంది ఇందులో పార్టిసిపేట్ చేసి తమ చీరలోని హుందాతనాన్ని, అందాన్ని ప్రదర్శించారు. సంప్రదాయ సౌరభాన్ని తెలిపారు. ఇప్పుడు మైక్రోబ్లాగింగ్ ట్విట్టర్ పిట్ట సాక్షిగా ‘మహిళలు’ మరో చాలెంజ్‌కు తెర లేపారు. అదే ‘బిందీ’ చాలెంజ్

గుడికి వెళ్లినప్పుడు మన ఆహార్యం ఒక విధంగా ఉంటుంది. అదే పెళ్లికి వెళితే.. మన గెటప్ అందుకు తగ్గట్లుగానే రెడీ అవుతాం. ఇక పార్టీకైతే.. పాష్ బట్టల్లో మెరిసిపోతాం. ఇలా వెళ్లే ప్రాంతాన్ని బట్టి, వేదికను అనుసరించి కట్టుబొట్టులో మార్పులు వస్తాయి. ముస్తాబుకు తగ్గట్టే బొట్టు కూడా ఉంటుంది. బొట్టు కూడా అలంకరణలో ప్రధాన పాత్రే పోషిస్తుంది. పెళ్లికూతరైనా, కొడుకైనా.. ఆ పెళ్లి బొట్టు పెట్టాక వచ్చే మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.

పాతకాలం వాళ్లు నుదిటి మీద రెండు మూడు బొట్లు పెట్టుకునేవారు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా గుండ్రంగానే బొట్టు ధరిస్తారు. అదే తమిళ పొన్నులు, మళయాల కుట్టీలు అడ్డబొట్టుతో మెరిసిపోతారు. మగవాళ్లు కూడా బొట్టు పెట్టుకోవడంతో శ్రద్ధ వహిస్తారు. బొట్టు పెట్టుకునే విషయంలో.. వైష్ణువుల రూటు వేరైతే.. శైవలల రూటు వేరు. ఇక సాయిబాబా భక్తులు విభూది ధరిస్తే, ఆంజనేయ బంటులు సింధూరాన్ని దిద్దుతారు. అయ్యప్ప మాలధారులు గంధపు బొట్టుతో కనిపిస్తారు.

బొట్టు మన భారతీయ సంప్రదాయంలో ఓ భాగం కూడాను. ఇప్పుడు నెటిజన్లు తమ బొట్టును బిందిట్విట్టర్ హ్యాష్ ట్యాగ్‌తో ఇంటర్నెట్ ట్రెండింగ్‌లో నిలిపారు. సింగర్ సోనా మోహపాత్ర, జర్నలిస్ట్ సోనాల్ కర్లా, జర్మన్ నటి సుజాన్నే బెర్నార్ట్‌తోపాటు..ఎంతోమంది నెటిజన్లు ఈ ట్రెండింగ్‌ చాలెంజ్‌లో పార్టిసిపేట్ చేశారు.

https://twitter.com/suzannebernert/status/1298559714142216193?s=20

Tags:    

Similar News