టీం ఇండియా గతిని మార్చింది రవిశాస్త్రి, కోహ్లీలే – మైకెల్ స్లేటర్

దిశ, స్పోర్ట్స్: టీం ఇండియా గతిని మార్చింది కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రీనే అని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకెల్ స్లేట్ అభిప్రాయపడ్డాడు. వారిద్దరు తీసుకున్న నిర్ణయాలే భారత జట్టు మెరుగైన స్థితికి రావడానికి కారణమని చెప్పారు. రవిశాస్త్రి, కోహ్లీ ఒకరికొకరు చాలెంజింగ్‌గా కనిపించినా, పని విషయంలో మాత్రం ఇరువురు పరస్పర నిర్ణయాలను గౌరవించుకుంటారని తెలిపాడు. స్టార్ స్పోర్ట్స్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన స్లేటర్ పలు విషయాలు పంచుకున్నాడు. ‘రవిశాస్త్రి, విరాట్‌ కోహ్లీలను నేను చాలా దగ్గర్నుంచి […]

Update: 2020-08-04 10:34 GMT

దిశ, స్పోర్ట్స్: టీం ఇండియా గతిని మార్చింది కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రీనే అని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకెల్ స్లేట్ అభిప్రాయపడ్డాడు. వారిద్దరు తీసుకున్న నిర్ణయాలే భారత జట్టు మెరుగైన స్థితికి రావడానికి కారణమని చెప్పారు. రవిశాస్త్రి, కోహ్లీ ఒకరికొకరు చాలెంజింగ్‌గా కనిపించినా, పని విషయంలో మాత్రం ఇరువురు పరస్పర నిర్ణయాలను గౌరవించుకుంటారని తెలిపాడు. స్టార్ స్పోర్ట్స్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన స్లేటర్ పలు విషయాలు పంచుకున్నాడు. ‘రవిశాస్త్రి, విరాట్‌ కోహ్లీలను నేను చాలా దగ్గర్నుంచి చూశాను. ఒకరికొకరు చాలెంజింగ్‌గా కనిపించినా, పని విషయంలో మాత్రం ఇరువురు పరస్పర నిర్ణయాలను గౌరవించుకుంటారు. కోహ్లీ కూడా కోచ్ నిర్ణయాలను గౌరవిస్తాడు’ అని చెప్పాడు. కొన్నిసార్లు వీరిద్దరి నిర్ణయాలు తప్పుగా అనిపించినా వాళ్లు మాత్రం సర్దుకునే పోతుండటం తాను గమనించానని స్లేటర్ అన్నాడు. తాను రవిశాస్త్రిని కామెంటరీ బాక్స్‌లో చాలా దగ్గర నుంచి గమనించానని, చాలా చురుకైన నిర్ణయాలు తీసుకుంటాడని స్లేటర్ తెలిపాడు.

Tags:    

Similar News