ఈ నెల 12 నుంచి డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి విస్తృత వ్యాప్తి మూలంగా వాయిదా పడిన డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను నిర్వహించేందుకు సన్నహాలు చేస్తోంది. అంతేగాకుండా మంగళవారం ఎంజీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మిర్యాల రమేశ్ పరీక్షల షెడ్యూల్, వివరాలు మంగళవారం వివరాలను వెల్లడించారు. ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకు ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఎంజీయూ తెలిపింది. కోవిడ్‌-19 నేపథ్యంలో పరీక్షా సమయాన్ని ఒక గంట తగ్గించినట్టు చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి […]

Update: 2020-09-01 07:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి విస్తృత వ్యాప్తి మూలంగా వాయిదా పడిన డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను నిర్వహించేందుకు సన్నహాలు చేస్తోంది. అంతేగాకుండా మంగళవారం ఎంజీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మిర్యాల రమేశ్ పరీక్షల షెడ్యూల్, వివరాలు మంగళవారం వివరాలను వెల్లడించారు. ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకు ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఎంజీయూ తెలిపింది. కోవిడ్‌-19 నేపథ్యంలో పరీక్షా సమయాన్ని ఒక గంట తగ్గించినట్టు చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహణ సమయం అని తెలిపారు.

అంతేగాకుండా సబ్జెక్టుల ప్రశ్నపత్రాలలో మార్పులు కూడా ఉంటాయని, ఒక విభాగం మాత్రమే ఉంటుందని విద్యార్థులకు వాటిలో ప్రశ్నల ఎంపిక ఉంటుందని చెప్పారు. అదేవిధంగా నాల్గవ సెమిస్టర్ పరీక్షలను సెప్టెంబర్ 13వ తేదీ నుండి ప్రారంభంకానున్నట్లు వెల్లడించారు. రెగ్యులర్, బ్యాక్ లాగ్ విద్యార్థులు నాల్గవ సెమిస్టర్ పరీక్షలకు హాజరుకావచ్చన్నారు. విద్యార్థులు ఫేస్ మాస్క్ ధరించి పరీక్షలకు హాజరు కావాలన్నారు. భౌతిక దూరం పాటిస్తూ పరీక్షల నిర్వహణ జరగనున్నట్టు చెప్పారు.

Tags:    

Similar News