ఎంజీ మోటార్స్ నుంచి సరికొత్త హెక్టార్ ప్లస్-2021 విడుదల!

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ తన ఎంజీ హెక్టార్స్ ఫేస్‌లిఫ్ట్, హెక్టార్ ప్లస్ 7 సీటర్ ఎస్‌యూవీలను భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో ఎంజీ హెక్టార్ ఫేస్‌లిఫ్ట్ ధర రూ. 12.89 లక్షలు(ఎక్స్‌షోరూమ్), హెక్టార్ ప్లస్ 7 సీటర్ ఎస్‌యూవీ ధర రూ. 13.34 లక్షలతో లభిస్తుందని కంపెనీ తెలిపింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ సరికొత్త ఎస్‌యూవీలు ఇదివరకటి కంటే మెరుగైన ఫీచర్స్, డిజైన్‌తో వస్తుందని, ఇటీరియర్స్ […]

Update: 2021-01-07 08:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ తన ఎంజీ హెక్టార్స్ ఫేస్‌లిఫ్ట్, హెక్టార్ ప్లస్ 7 సీటర్ ఎస్‌యూవీలను భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో ఎంజీ హెక్టార్ ఫేస్‌లిఫ్ట్ ధర రూ. 12.89 లక్షలు(ఎక్స్‌షోరూమ్), హెక్టార్ ప్లస్ 7 సీటర్ ఎస్‌యూవీ ధర రూ. 13.34 లక్షలతో లభిస్తుందని కంపెనీ తెలిపింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ సరికొత్త ఎస్‌యూవీలు ఇదివరకటి కంటే మెరుగైన ఫీచర్స్, డిజైన్‌తో వస్తుందని, ఇటీరియర్స్ కూడా అప్‌గ్రేడ్‌తో లభిస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

దేశవ్యాప్తంగా గురువారం నుంచే కంపెనీ డీలర్‌షిప్, అధికారిక వెబ్‌సైట్ల ద్వారా ఎంజీ హెక్టార్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్‌లను ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. ఈ మోడల్ నాలుగు వేరియంట్లలో లభిస్తుందని, ఇందులో టాప్ వేరియంట్ ధర రూ. 18.32 లక్షలుగా నిర్ణయించినట్టు పేర్కొంది. ఇక, 7-సీటర్ హెక్టార్ ప్లస్ మూడు సిటింగ్ ఆప్షన్లలో లభిస్తుందని, కొనుగోలుదారులు ఐదు, ఆరు, ఏడు సీట్ల వెర్షన్లను ఎంచుకోవచ్చని కంపెనీలు తెలిపింది. త్వరలో మార్కేట్లోకి రాబోతున్న టాటా సఫారి మోడల్‌కు హెక్టార్ ప్లస్ 7-సీటర్ పోటీగా ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. హెక్టార్ ప్లస్ 7-సీటర్ ధర రూ. 13.34 లక్షల నుంచి రూ. 18.33 లక్షల మధ్య లభిస్తుందని కంపెనీ వెల్లడించింది.

Tags:    

Similar News