MRP కన్నా ఎక్కువకు అమ్మాడు.. రూ. 15000 ఫైన్ పడింది
దిశ, డైనమిక్ బ్యూరో : రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్‌లో ఎమ్ఆర్‌పీ ధరకంటే ఎక్కువ రేటుకు అమ్ముతున్న వారిపై మెట్రాలజీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో ఇలాంటి వారిని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. అయితే ఎక్కడైనా ఇలా అధిక ధరలకు అమ్మకాలు జరిపితే ఈ మెయిల్ ద్వారా మెట్రాలజీ అధికారులు సమాచారం ఇస్తే వెంటనే వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో జూలై 26న నగరంలోని జూబ్లీహిల్స్ లోని తెలంగాణ స్పైస్ కిచెన్ కి వెళ్లిన సామాజిక […]
దిశ, డైనమిక్ బ్యూరో : రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్‌లో ఎమ్ఆర్‌పీ ధరకంటే ఎక్కువ రేటుకు అమ్ముతున్న వారిపై మెట్రాలజీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో ఇలాంటి వారిని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. అయితే ఎక్కడైనా ఇలా అధిక ధరలకు అమ్మకాలు జరిపితే ఈ మెయిల్ ద్వారా మెట్రాలజీ అధికారులు సమాచారం ఇస్తే వెంటనే వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో జూలై 26న నగరంలోని జూబ్లీహిల్స్ లోని తెలంగాణ స్పైస్ కిచెన్ కి వెళ్లిన సామాజిక వేత్త విజయ్ గోపాల్ అక్కడ ఎమ్ఆర్‌పీ కంటే ఎక్కువ రేటుకి అమ్మడాన్ని గుర్తించి హైదరాబాద్ మెట్రాలజీ అధికారులకు ఈమెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారు. దీనిపై స్పందించిన అధికారులు రూ.15వేలు జరిమానా విదిస్తున్నట్లు ఆయనకి మెయిల్ ద్వారా సమాచారం అందించిన్లు విజయ్ తెలిపారు. ఎమ్ఆర్‌పీ రేటు కంటే ఎక్కువ ధరకి ఎక్కడ ఏ వస్తువు అమ్మినా.. వెంటనే సంబంధిత అధికారులకు తెలపాలని విజ్ఞప్తి చేశారు.
Telangana spice kitchen, Jubilee Hills, has been penalized 15k by Hyderabad z Legal Metrology Team, for selling stuff above MRP. People need to stop their ridiculous practices and allow people to have water without corruption associated with it.
Ty,
VG— Vijay Gopal (@VijayGopal_) September 9, 2021