అలర్ట్: తెలంగాణలో రెండ్రోజుల పాటు వర్షాలు

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు, రేపు కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తమిళనాడు తీరంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు పడతాయని ఆ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఖమ్మం, ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్, నల్గొండ, కామారెడ్డి, నిజామాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మరికొన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం పడే […]

Update: 2021-11-01 02:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు, రేపు కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తమిళనాడు తీరంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు పడతాయని ఆ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఖమ్మం, ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్, నల్గొండ, కామారెడ్డి, నిజామాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మరికొన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశాలు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. కావున రైతులు, లోతట్టు ప్రాంతపు వాసులు అప్రమత్తంగా ఉండాలన్నారు సూచించారు.

Tags:    

Similar News