‘లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా చర్యలు’
దిశ, కంటోన్మెంట్: వర్షకాలంలో వరద నీరు మూలంగా లోతట్టు ప్రాంతాలను ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని కంటోన్మెంట్ బోర్డు సభ్యులు సాదాకేశవరెడ్డి, అనితలు అన్నారు. మంగళవారం బేగంపేట ప్యాట్నీ కాంపౌండ్‌లో జరుగుతున్న నాలా పూడిక తీత పనులను వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్యాట్నీ నాలా కోసం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి విన్నవించగా, రూ.48 లక్షలతో పనులను పూర్తిచేయాలని సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించినట్టు తెలిపారు. నాలా అభివృద్ధి పనులను […]
దిశ, కంటోన్మెంట్: వర్షకాలంలో వరద నీరు మూలంగా లోతట్టు ప్రాంతాలను ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని కంటోన్మెంట్ బోర్డు సభ్యులు సాదాకేశవరెడ్డి, అనితలు అన్నారు. మంగళవారం బేగంపేట ప్యాట్నీ కాంపౌండ్‌లో జరుగుతున్న నాలా పూడిక తీత పనులను వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్యాట్నీ నాలా కోసం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి విన్నవించగా, రూ.48 లక్షలతో పనులను పూర్తిచేయాలని సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించినట్టు తెలిపారు. నాలా అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని వారు హామీ ఇచ్చారు.