ఆ బటర్ చికెన్ విలువ.. రూ. 87 వేలు

దిశ, వెబ్‌డెస్క్ : ఓ వైపు కరోనా కరాళ నృత్యం చేస్తుంటే.. కొందరు మాత్రం తమకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏదో సాకుతో రోడ్ల మీద తిరుగుతున్నారు. మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తుండగా.. గ్రామాలు, పట్టణాల్లో స్వచ్ఛంద లాక్‌డౌన్ పాటిస్తున్నారు. మనదేశంలోనే కాదు.. కరోనా కట్టడికి లాక్‌డౌనే ఉత్తమమని కొన్ని దేశాల్లో ఇప్పటికీ లాక్‌డౌన్ కొనసాగిస్తున్నారు. అందులో ఆస్ట్రేలియా కూడా ఒకటి. అయితే మెల్‌బోర్న్‌లోని భారతి సంతతి వ్యక్తి ఒకరు.. బటర్ చికెన్ […]

Update: 2020-07-21 07:44 GMT

దిశ, వెబ్‌డెస్క్ :
ఓ వైపు కరోనా కరాళ నృత్యం చేస్తుంటే.. కొందరు మాత్రం తమకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏదో సాకుతో రోడ్ల మీద తిరుగుతున్నారు. మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తుండగా.. గ్రామాలు, పట్టణాల్లో స్వచ్ఛంద లాక్‌డౌన్ పాటిస్తున్నారు. మనదేశంలోనే కాదు.. కరోనా కట్టడికి లాక్‌డౌనే ఉత్తమమని కొన్ని దేశాల్లో ఇప్పటికీ లాక్‌డౌన్ కొనసాగిస్తున్నారు. అందులో ఆస్ట్రేలియా కూడా ఒకటి. అయితే మెల్‌బోర్న్‌లోని భారతి సంతతి వ్యక్తి ఒకరు.. బటర్ చికెన్ కోసం లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించాడు. దాంతో ఆస్ట్రేలియా పోలీసులు అతడికి భారీగా జరిమానా విధించారు.

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌‌లో కరోనా కేసులు పెరగడంతో.. అక్కడ లాక్‌డౌన్ విధించారు. అయితే మెల్‌బోర్న్‌కు చెందిన అట్కిన్సన్‌‌కు (భారత సంతతి వ్యక్తి) రాత్రి పూట బటర్ చికెన్ తినాలనిపించింది. కానీ, అప్పటికే రాత్రి 11 అవుతుండటంతో అతనుండే ప్రాంతంలోని రెస్టారెంట్లన్నీ మూసివేశారు. అక్కడి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఓ రెస్టారెంట్ మాత్రమే ఓపెన్ చేసి ఉంది. కానీ వాళ్లు అంత దూరం నుంచి హోమ్ డెలివరీ చేయలేమని చెప్పారు. దీంతో అట్కిన్సన్ స్వయంగా ఆ రెస్టారెంట్‌కు వెళ్దామని బయలుదేరగా దారిలో పోలీసులు పట్టుకున్నారు. అట్కిన్సన్ ఆరా తీస్తే.. బటర్ చికెన్ తినేందుకు వెళ్తున్నాని తేల్చి చెప్పాడు. అసలే లాక్‌డౌన్.. అప్పటికే అర్ధరాత్రి. ఇంకేం పోలీసులు మనోడికి లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను 1652 ఆస్ట్రేలియన్ డాలర్లు జరిమానా విధించారు. భారత కరెన్సీలో రూ. 87 వేల 318 రూపాయలు. అట్కిన్సన్ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Tags:    

Similar News