వారి హత్యలను ఆపాలని డిమాండ్.. ఢిల్లీలో ధర్నాకు దిగిన మెహబూబా ముఫ్తీ
న్యూఢిల్లీ: జమ్మూ, కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ దేశ రాజధాని ఢిల్లీలో ధర్నాకు దిగారు. లోయ ప్రాంతంలో అమాయకుల హత్యలను వెంటనే ఆపాలని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి సోమవారం డిమాండ్ చేశారు. కాశ్మీర్ లో నిరసనలకు అవకాశమివ్వకపోవడంతో దేశ రాజధానిలో చేపట్టినట్లు తెలిపారు. కాశ్మీర్ బాధలో ఉందని అన్నారు. అమాయకులపై హత్యలు ఆపాలని ఫ్లకార్డులతో జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు. ధర్నా చేపట్టాలనుకున్న ప్రతిసారీ గృహనిర్బంధమో లేదా పోలీసులతో దాడి చేయడమో చేసేవారని […]
న్యూఢిల్లీ: జమ్మూ, కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ దేశ రాజధాని ఢిల్లీలో ధర్నాకు దిగారు. లోయ ప్రాంతంలో అమాయకుల హత్యలను వెంటనే ఆపాలని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి సోమవారం డిమాండ్ చేశారు. కాశ్మీర్ లో నిరసనలకు అవకాశమివ్వకపోవడంతో దేశ రాజధానిలో చేపట్టినట్లు తెలిపారు.
కాశ్మీర్ బాధలో ఉందని అన్నారు. అమాయకులపై హత్యలు ఆపాలని ఫ్లకార్డులతో జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు. ధర్నా చేపట్టాలనుకున్న ప్రతిసారీ గృహనిర్బంధమో లేదా పోలీసులతో దాడి చేయడమో చేసేవారని చెప్పారు. ‘ప్రజలు తమ అభిప్రాయాన్ని బయటకు చెప్పనీయకుండా కాశ్మీర్ ఓ జైలులా మారింది. 2019 ఆగస్టు నుంచి వారు అణచివేతకు గురవుతున్నారు. ఆశ్చర్యకరంగా కొన్ని పెయిడ్ మీడియాలతో లోయలో అంతా బానే ఉన్నట్లు చిత్రీకరించడంలో ప్రభుత్వం బిజీగా ఉంది’ అని తెలిపారు. నాగాలాండ్ పౌరులపై కాల్పులు జరిగినపుడు స్పందించిన కేంద్రం, జమ్మూ విషయంలో ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు.జమ్మూ, కాశ్మీర్ లో అవినీతి పేరుకుపోయిందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కొకపోతే, గాంధీ అంబేడ్కర్‌ల దేశం, గాడ్సేల దేశంగా మారతుందని అన్నారు.