నన్ను మళ్లీ నిర్భంధించారు : మెహబూబా ముఫ్తీ
దిశ, వెబ్‌డెస్క్ : తనను మళ్లీ అక్రమంగా నిర్బంధించారని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ అన్నారు. గత రెండ్రోజులుగా పుల్వామా పర్యటించేందుకు అనుమతించడం లేదన్నారు. బీజేపీ మంత్రులు, వారి అనుచరులు కశ్మీర్‌లోని ఏ మూలకు వెళ్లినా ఏర్పడని భద్రతా సమస్య, తాను బయట అడుగుపెడితేనే ఏర్పడుతుందా? అని జమ్ము కశ్మీర్ ప్రభుత్వాన్ని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. పీడీపీ యువజన విభాగం నేత వహీద్‌నూ అసత్య ఆరోపణలతో అరెస్టు చేశారని ఆరోపించారు.కనీసం ఆయన కుటుంబాన్ని […]
దిశ, వెబ్‌డెస్క్ : తనను మళ్లీ అక్రమంగా నిర్బంధించారని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ అన్నారు. గత రెండ్రోజులుగా పుల్వామా పర్యటించేందుకు అనుమతించడం లేదన్నారు. బీజేపీ మంత్రులు, వారి అనుచరులు కశ్మీర్‌లోని ఏ మూలకు వెళ్లినా ఏర్పడని భద్రతా సమస్య, తాను బయట అడుగుపెడితేనే ఏర్పడుతుందా? అని జమ్ము కశ్మీర్ ప్రభుత్వాన్ని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
పీడీపీ యువజన విభాగం నేత వహీద్‌నూ అసత్య ఆరోపణలతో అరెస్టు చేశారని ఆరోపించారు.కనీసం ఆయన కుటుంబాన్ని ఓదార్చేందుకు పుల్వామా వెళ్లడానికి తనకు అనుమతి ఇవ్వడం లేదని ట్వీట్ చేశారు. తన ఇంటి ముందే నిలిపి ఉంచిన బలగాల ట్రక్కు ఫొటోను ఆమె పోస్టుచేశారు. దీనిపై ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. తన తండ్రిని అడ్డుకునేందుకు ఇలాగే ట్రక్కును ఇంటి ముందు పార్క్ చేసేవారని జమ్మకశ్మీర్ మాజీ సీఎం ట్వీట్ చేశారు. న్యాయ వ్యవస్థతో సంబంధం లేకుండా వ్యక్తిగత స్వేచ్ఛతో సర్కారు తన అభిష్టానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నదని విమర్శలు గుప్పించారు.