మిరాకిల్ జరగబోతోంది : చిరు సర్జా భార్య
నా బిడ్డగా తిరిగి వస్తావ్ కన్నడ హీరో చిరంజీవి సర్జా ఆకస్మిక మరణంతో తన భార్య, హీరోయిన్ మేఘనా రాజ్ చాలా కుంగిపోయింది. మూడు ముళ్ల బంధంతో ఏకమై రెండేళ్లు కూడా గడవకముందే తనను విడిచి వెళ్లిన చిరు గురించి ప్రతీక్షణం బాధపడుతోంది. ప్రస్తుతం గర్భిణీగా ఉన్న తను.. చిరుతో కలిసి తమ బిడ్డను ఈ లోకంలోకి ఆహ్వానిద్దాం అనుకున్నా.. ఆ ఆశ తీరకుండానే చిరు తనకు శోకాన్ని మిగిల్చి వెళ్లాడు. కానీ చిరుకు ఒక మాట […]
నా బిడ్డగా తిరిగి వస్తావ్
కన్నడ హీరో చిరంజీవి సర్జా ఆకస్మిక మరణంతో తన భార్య, హీరోయిన్ మేఘనా రాజ్ చాలా కుంగిపోయింది. మూడు ముళ్ల బంధంతో ఏకమై రెండేళ్లు కూడా గడవకముందే తనను విడిచి వెళ్లిన చిరు గురించి ప్రతీక్షణం బాధపడుతోంది. ప్రస్తుతం గర్భిణీగా ఉన్న తను.. చిరుతో కలిసి తమ బిడ్డను ఈ లోకంలోకి ఆహ్వానిద్దాం అనుకున్నా.. ఆ ఆశ తీరకుండానే చిరు తనకు శోకాన్ని మిగిల్చి వెళ్లాడు. కానీ చిరుకు ఒక మాట చెప్పాలని కోరుకుంటున్న మేఘనా రాజ్.. ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేకపోతోందని తెలిపింది. కాగా ట్విట్టర్లో తన పోస్ట్ నెటిజన్లను కంటతడి పెట్టించింది.
‘ప్రపంచంలో ఉన్న పదాలేవి నువ్వు నాకు ఎంత ముఖ్యమో చెప్పలేకపోతున్నాయి.. నా స్నేహితుడు, నా ప్రేమికుడు, నా పార్టనర్, నా బేబీ, నా నమ్మకం, నా భర్త.. ఇంతకు మించిన అనుబంధం ఉంది నీతో.. నువ్వు నా ఆత్మలో భాగానివి.
కానీ నాకే అర్థం కాని ఒక బాధ నా ఆత్మను కాల్చేస్తోంది.. నేను తలుపు వైపు చూసినప్పుడు నేను ఇంట్లో ఉన్నాను అని నువ్వు అరిచే అరుపులు వినలేకపోతున్నా.. ప్రతీ రోజూ, ప్రతీ నిమిషం నిన్ను తాకలేకపోతున్నాను అనే బాధ కొన్ని వేల మరణాలు అనుభవించినట్లు నన్ను రోజు రోజుకూ దిగజారుస్తోంది. కానీ ఆ సమయంలో ఒక మ్యాజికల్ ఫోర్స్‌లా నువ్వు నన్ను చుట్టుముట్టి ఉన్నావని నాకు తెలుస్తోంది. నేను వీక్‌గా ఫీలైన ప్రతీసారి గార్డియన్ ఏంజిల్లా నన్ను పైకి లేపుతున్నావు. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావంటే నన్ను ఒంటరిగా వదిలి వెళ్లలేనంతగా.. నువ్వు వెళ్లగలవా?. మన ప్రేమకు ప్రతిరూపమైన బేబీ.. నువ్వు ఇచ్చిన గొప్ప బహుమతి నాకు. ఒ స్వీట్ మిరాకిల్‌తో నిన్ను నా బిడ్డగా మళ్లీ ఈ భూమి మీదకు తెచ్చుకుంటాను. నీ స్మైల్‌ను చూసేందుకు వెయిట్ చేయలేకపోతున్నా.. గదిని ప్రకాశవంతంగా మార్చే ఆ నవ్వును వినేందుకు ఆరాటపడుతున్నా.. నువ్వు నాలోనే ఉన్నావు.. మా చివరి శ్వాస వరకు నువ్వు జీవించే ఉంటావు’ అంటూ తన భర్తకు స్వీట్ మెసేజ్ పంపింది మేఘనా రాజ్.
ఈ నోట్ చదివిన ప్రతీ ఒక్కరూ ఉద్వేగానికి లోనవుతూనే.. మరింత స్ట్రాంగ్ గా ఉండాలని మేఘనా రాజ్ ను కోరుతున్నారు. మిస్ యూ చిరు అంటూ రిప్లై ఇస్తున్నారు.
MY CHIRU FOREVER ❤️ pic.twitter.com/sqON30wHKR
— MEGHANA RAJ (@meghanasraj) June 18, 2020