చిరంజీవి సంచలన నిర్ణయం.. ప్రతీ జిల్లాకు ఆక్సిజన్ బ్యాంక్

దిశ, సినిమా : రక్తం అందక ఏ ఒక్కరూ చనిపోకూడదనే ఉద్దేశంతో 1998లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్థాపించిన చిరంజీవి.. ప్రస్తుతం ఆక్సిజన్ అందక కరోనా రోగులు మృతిచెందడం తట్టుకోలేక మరో నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ జిల్లాలోనూ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు చేసేందుకు సంకల్పించారు. వారం రోజుల్లో ప్రజలకు ఆక్సిజన్ బ్యాంక్ అందుబాటులోకి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రామ్ చరణ్ ఆక్సిజన్ బ్యాంక్స్‌ గురించి మానిటర్ చేయనుండగా.. ఆ జిల్లాకు సంబంధించిన […]

Update: 2021-05-20 06:46 GMT

దిశ, సినిమా : రక్తం అందక ఏ ఒక్కరూ చనిపోకూడదనే ఉద్దేశంతో 1998లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్థాపించిన చిరంజీవి.. ప్రస్తుతం ఆక్సిజన్ అందక కరోనా రోగులు మృతిచెందడం తట్టుకోలేక మరో నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ జిల్లాలోనూ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు చేసేందుకు సంకల్పించారు. వారం రోజుల్లో ప్రజలకు ఆక్సిజన్ బ్యాంక్ అందుబాటులోకి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రామ్ చరణ్ ఆక్సిజన్ బ్యాంక్స్‌ గురించి మానిటర్ చేయనుండగా.. ఆ జిల్లాకు సంబంధించిన ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ వీటిని హ్యాండిల్ చేయనున్నారు. కాగా ఇంత గొప్ప ఇనిషియేటివ్ తీసుకున్న చిరు, చరణ్‌లను అభినందిస్తున్నారు నెటిజన్లు.

 

Tags:    

Similar News