పానీపూరి మెషిన్.. ఎలా పని చేస్తుందో తెలుసా..?

దిశ, ఫీచర్స్‌: ఇండియన్ స్ట్రీట్‌ ఫుడ్స్‌లో ఎక్కువ మంది ఇష్టపడేది ‘పానీపూరి’నే. కొన్ని ప్రాంతాల్లో ‘గోల్‌గప్పా’గా పిలువబడే ఈ ఐటమ్‌ కోసం ఫుడ్ లవర్స్ ఎంతగా పడిచస్తారో లాక్‌డౌన్ టైమ్‌‌లో చూసే ఉంటారు. అయితే పాండమిక్ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. హైజీన్ సమస్యల కారణంగా కొంతమంది పానీపూరికి దూరమవుతుండగా, మరికొందరు కాంటాక్ట్‌లెస్ సర్వీస్ కోరుకుంటున్నారు. ఈ తరహా సేవల కోసం ఇప్పటికే పానీపూరి మెషిన్స్ అందుబాటులోకి రాగా.. తాజాగా వాటన్నింటి కంటే భిన్నంగా పేమెంట్ నుంచి గోల్ […]

Update: 2021-12-02 05:53 GMT

దిశ, ఫీచర్స్‌: ఇండియన్ స్ట్రీట్‌ ఫుడ్స్‌లో ఎక్కువ మంది ఇష్టపడేది ‘పానీపూరి’నే. కొన్ని ప్రాంతాల్లో ‘గోల్‌గప్పా’గా పిలువబడే ఈ ఐటమ్‌ కోసం ఫుడ్ లవర్స్ ఎంతగా పడిచస్తారో లాక్‌డౌన్ టైమ్‌‌లో చూసే ఉంటారు. అయితే పాండమిక్ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. హైజీన్ సమస్యల కారణంగా కొంతమంది పానీపూరికి దూరమవుతుండగా, మరికొందరు కాంటాక్ట్‌లెస్ సర్వీస్ కోరుకుంటున్నారు. ఈ తరహా సేవల కోసం ఇప్పటికే పానీపూరి మెషిన్స్ అందుబాటులోకి రాగా.. తాజాగా వాటన్నింటి కంటే భిన్నంగా పేమెంట్ నుంచి గోల్ గప్పాస్ సర్వింగ్ వరకు పూర్తిగా కాంటాక్ట్‌లెస్‌ సర్వీస్ అందించే మెషిన్‌ను రూపొందించడం విశేషం.

ఫుడ్డీ విశాల్ అనే యూట్యూబ్ బ్లాగర్.. ఈ మెషిన్ పనితీరును వివరించే వీడియోను షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. మెషిన్‌లోని స్క్రీన్‌పై గోల్ గప్పా, వడ పావ్ ధరలు పేర్కొన్నారు. కస్టమర్స్ QR కోడ్‌ను స్కాన్ చేసి పేమెంట్స్ చేయగానే, మెషిన్ నుంచి పానీపూరితో కూడిన సీల్డ్ ప్యాక్‌ బయటకొస్తుంది. ఆ ప్యాక్‌ ఓపెన్ చేస్తే అందులో పూరీలతో పాటు మసాల, ఓ ప్లాస్టిక్ గ్లా్స్ ఉంటుంది. స్వీట్, స్పైసీ, హింగ్, మిక్స్ వంటి నాలుగు రకాల నుంచి కస్టమర్స్ తమకు నచ్చిన ఫ్లేవర్స్‌ ఎంచుకోవచ్చు. ముందుగా రెసిపీని గ్లాసులో ఫిల్ చేసుకుని, ఆ తర్వాత పానీపూరీలో పోసుకుని తినవచ్చు. దీన్ని ఢిల్లీకి చెందిన రోబోటిక్ ఇంజనీర్ గోవింద్ తయారుచేశాడు.

భారత్‌లోనే కాదు ప్రపంచంలోనూ ఈ తరహా మెషిన్స్‌లో ఇదే మొదటిది. ఇందులోని క్లౌడ్ సర్వర్, బ్యాకెండ్‌లో ఉపయోగించే అప్లికేషన్స్, సాఫ్ట్‌వేర్ వరకు అన్నింటికీ ఇండియన్ టెక్నాలజీనే ఉపయోగించాం. ఇది మేడ్ ఇన్ ఇండియా వెండింగ్ మెషిన్. 2018 లోనే ఈ మెషిన్ తీసుకొచ్చేందుకు పని ప్రారంభించాను. అయితే సమయాభావం కారణంగా పూర్తి చేయలేకపోయాను. లాక్‌డౌన్‌ వల్ల మళ్లీ దానిపై పనిచేయడంతో ఫైనల్‌గా పూర్తిచేశాను. మార్చి లో తొలి మోడల్ తీసుకురాగా చాలా ఆర్డర్స్ వచ్చాయి. కమర్షియల్ వెర్షన్‌ రూపొందించడంతో ఆర్డర్ల సంఖ్య పెరిగింది.

– గోవింద్, రోబోటిక్స్ ఇంజనీర్, సైబర్ కేఫ్ ఓనర్, ఢిల్లీ.

Tags:    

Similar News