నాసా వర్చువల్ ప్యానెల్‌లో 14 ఏళ్ల ఇండియన్ గర్ల్
దిశ, ఫీచర్స్ : మహారాష్ట్ర, ఔరంగాబాద్‌కు చెందిన14 ఏళ్ల బాలిక.. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’కు చెందిన మైనారిటీ సర్వింగ్ ఇన్‌స్టిట్యూషన్ (ఎంఎస్‌ఐ) ఫెలోషిప్స్ వర్చువల్ ప్యానెల్‌కు ఎంపికైంది. టెన్త్ క్లాస్ గర్ల్ దీక్షా షిండే.. సెప్టెంబర్ 2020లో స్టీఫెన్ హాకింగ్ బుక్స్ చదివిన తర్వాత ‘క్వశ్చనింగ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్’ పేరుతో రాసిన వ్యాసాన్ని నాసాకు సబ్మిట్ చేసింది. మొదటి ప్రయత్నంలో రిజెక్ట్ కావడంతో కొద్దిపాటి మార్పులు చేసి 2020లో మళ్లీ సబ్మిట్ […]
దిశ, ఫీచర్స్ : మహారాష్ట్ర, ఔరంగాబాద్‌కు చెందిన14 ఏళ్ల బాలిక.. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’కు చెందిన మైనారిటీ సర్వింగ్ ఇన్‌స్టిట్యూషన్ (ఎంఎస్‌ఐ) ఫెలోషిప్స్ వర్చువల్ ప్యానెల్‌కు ఎంపికైంది. టెన్త్ క్లాస్ గర్ల్ దీక్షా షిండే.. సెప్టెంబర్ 2020లో స్టీఫెన్ హాకింగ్ బుక్స్ చదివిన తర్వాత ‘క్వశ్చనింగ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్’ పేరుతో రాసిన వ్యాసాన్ని నాసాకు సబ్మిట్ చేసింది. మొదటి ప్రయత్నంలో రిజెక్ట్ కావడంతో కొద్దిపాటి మార్పులు చేసి 2020లో మళ్లీ సబ్మిట్ చేసింది. కాగా రెండోసారి కూడా తిరస్కరణకు గురైంది.
అయితే అక్కడితో నిరాశ చెందని షిండే.. డిసెంబర్ 2020లో ‘బ్లాక్ హోల్’పై రీసెర్చ్ ఆర్టికల్ పంపించగా ‘నాసా’కు నచ్చింది. ఈ మేరకు ‘ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ సెర్చ్ కొలాబరేషన్’ నిర్వహించిన రీసెర్చ్ కాంపిటీషన్‌ను గెలుచుకుంది. ఇందులో తను తాత్కాలికంగా ‘మెయిన్ బెల్ట్ ఆస్టరాయిడ్’ను కనుగొన్నట్టు షిండే తెలిపింది. ఈ ఏడాది మే నెలలో ‘వి లివ్ ఇన్ బ్లాక్ హోల్?’ టైటిల్ గల తన రీసెర్చ్ పేపర్‌ను ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్’ యాక్సెప్ట్ చేసింది. ఈ క్రమంలోనే నాసాకు చెందిన 2021 ఎంఎస్ఐ ఫెలోషిప్ వర్చువల్ ప్యానెల్‌కు ఎంపికైంది.
Maharashtra | Diksha Shinde, a 14-yr-old girl in Aurangabad, was selected as a panellist on NASA's MSI Fellowships Virtual Panel.
"I wrote a theory on black holes & God. It was accepted by NASA after 3 attempts. They asked me to write articles for their website,"she said (18.08) pic.twitter.com/yxDqApWKWm
— ANI (@ANI) August 19, 2021
ఈ ఆఫర్‌ను అంగీకరించిన షిండే, త్వరలో వర్క్ స్టార్ట్ చేస్తానని చెప్పింది. జాబ్‌లో భాగంగా పరిశోధకులు సమర్పించిన ప్రతిపాదనలను సమీక్షించి, NASAతో పరిశోధనలకు సంబంధించి సహకార విధానాన్ని వివరించాల్సి ఉంటుందని వెల్లడించింది. కాగా ఈ పరిశోధనలకు సంబంధించి చర్చలకు ఆల్టర్నేటివ్ డేస్‌లో హాజరు కావల్సి ఉండగా, ఉదయం 1- ఉ.4 గంటల వరకు చేసే పనికి జీతం కూడా చెల్లించనున్నారు. కాగా తనకు 18 ఏళ్లు నిండాక నాసాలో శిక్షణ పొందుతానని ఈ యంగ్ రీసెర్చర్ ఆశాభావం వ్యక్తం చేసింది.