Meera Chopra : ఫ్రంట్‌లైన్ వారియర్ అంటూ వ్యాక్సిన్ తీసుకున్న హీరోయిన్.. నెటిజన్ల ఫైర్
దిశ, సినిమా : హీరోయిన్ మీరా చోప్రాపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. థానేకు చెందిన ఫ్రంట్‌లైన్ వారియర్‌ను అంటూ ఫేక్ ఐడీతో కరోనా వ్యాక్సిన్ వేయించుకుందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్‌లో #ShameOnYouMeera హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుండగా.. బీజేపీ ఎమ్మెల్సీ మనోహర్ దుంబ్రే మీరాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే వీటన్నింటిని ఖండించిన మీరా.. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ‘కరోనా నుంచి కాపాడుకునేందుకు అందరం వ్యాక్సిన్ వేయించుకోవాలని అనుకుంటున్నాం. […]
దిశ, సినిమా : హీరోయిన్ మీరా చోప్రాపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. థానేకు చెందిన ఫ్రంట్‌లైన్ వారియర్‌ను అంటూ ఫేక్ ఐడీతో కరోనా వ్యాక్సిన్ వేయించుకుందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్‌లో #ShameOnYouMeera హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుండగా.. బీజేపీ ఎమ్మెల్సీ మనోహర్ దుంబ్రే మీరాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే వీటన్నింటిని ఖండించిన మీరా.. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.
‘కరోనా నుంచి కాపాడుకునేందుకు అందరం వ్యాక్సిన్ వేయించుకోవాలని అనుకుంటున్నాం. ఇందుకోసం మన వంతు ప్రయత్నం చేస్తున్నా్ం. అదేవిధంగా నాకు తెలిసిన వ్యక్తులను సహాయం అడిగి, నెల తర్వాత వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేసుకోగలిగాను’ అని తెలిపింది. ‘నన్ను ఆధార్ కార్డు సెండ్ చేయమని సూచించారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఐడి నాది కాదు. రిజిస్ట్రేషన్ కోసం నా ఆధార్ మాత్రమే అడిగారు. నేను ఇచ్చిన ఏకైక ఐడి కూడా అదే. మనం సంతకం చేసేంత వరకు ఏ ఐడి చెల్లుబాటు కాదని గుర్తుంచుకోండి. నాకు సంబంధించిన ఫేక్ ఐడి ట్విట్టర్‌లో మాత్రమే చూశాను. నేను ఇలాంటి పద్ధతులకు పూర్తి వ్యతిరేకం. అలాంటి ఫేక్ ఐడి ఎవరు? ఎందుకు? తయారు చేశారో నేను కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నా’ అని స్పష్టం చేసింది.
https://twitter.com/SurekhaTarakian/status/1398902764722212865?s=20