50 హార్ట్ సర్జరీలు సక్సెస్.. గర్వంగా ఉందన్న మెడికవర్ ఆసుపత్రి వైద్యులు

దిశ ప్రతినిధి, నిజామాబాద్: మెడికవర్ ఆసుపత్రిలో గత ఆరు నెలల్లో 50 మందికి పైగా గుండె సర్జరీ(ఓపెన్ హార్ట్ సర్జరీ)లు విజయవంతంగా పూర్తి చేసినట్టు మెడికవర్ ఆసుపత్రి గ్రూప్ డైరెక్టర్, గుండె సర్జరీ వైద్య నిపుణులు, డాక్టర్ కృష్ణప్రసాద్, డాక్టర్ అవీన్ సనార్‌లు అన్నారు. నిజామాబాద్ మెడికవర్ ఆసుపత్రిలో గుండె సర్జరీ అనంతరం కోలుకున్న పేషెంట్లతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. గత ఆరు నెలల్లో 50 […]

Update: 2021-10-12 06:31 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: మెడికవర్ ఆసుపత్రిలో గత ఆరు నెలల్లో 50 మందికి పైగా గుండె సర్జరీ(ఓపెన్ హార్ట్ సర్జరీ)లు విజయవంతంగా పూర్తి చేసినట్టు మెడికవర్ ఆసుపత్రి గ్రూప్ డైరెక్టర్, గుండె సర్జరీ వైద్య నిపుణులు, డాక్టర్ కృష్ణప్రసాద్, డాక్టర్ అవీన్ సనార్‌లు అన్నారు. నిజామాబాద్ మెడికవర్ ఆసుపత్రిలో గుండె సర్జరీ అనంతరం కోలుకున్న పేషెంట్లతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. గత ఆరు నెలల్లో 50 మందికి పైగా ఓపెన్ హార్ట్ సర్జరీలు విజయవంతంగా పూర్తిచేసి, డిశ్చార్జ్ అయినా ప్రతీ పేషెంట్ పూర్తిస్థాయిలో కోలుకోవడం జిల్లాలోనే మొదటిసారి అన్నారు. పూర్తిస్థాయి డాక్టర్ల బృందంతో ఆరోగ్య శ్రీ ద్వారా, ఎటువంటి డబ్బులు చెల్లించకుండా సర్జరీ సేవలు నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాల ప్రజలు వినియోగించుకున్నారని తెలిపారు.

సర్జరీ అనంతరం ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా కేవలం ఐదు రోజుల్లోనే ఆరోగ్యంగా డిశ్చార్జ్ అవ్వడం హర్షించాల్సిన విషయం అన్నారు. గత నెల రోజుల వ్యవధిలో 20 మందికి విజయవంతంగా గుండె సర్జరీలు నిర్వహించడం గర్వ కారణమని, రాబోయే రోజుల్లో నూతన టెక్నాలజీ, అత్యాధునిక పరికరాలతో ఆపరేషన్ థియేటర్‌లను ఆధునీకరిస్తామని అన్నారు. ఆసుపత్రి పూర్తిస్థాయి వైద్యులు డాక్టర్ అవీన్ సనార్ మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేసుకున్న ప్రతీ పేషెంట్‌కు పూర్తి ఉచిత వైద్యం అందించి, మందులు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. గత ఆరేండ్లుగా 5 వేల మందికి పైగా యాంజియో గ్రామ్ పరీక్షలు, వేయిమందికి పైగా గుండెలో స్టంట్‌లు అమర్చే సేవలు అందించామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని అత్యాధునిక ఫిలిప్స్ అజురీయన్ కాతలాబ్ సౌకర్యం మెడికవర్ ఆసుపత్రిలో ప్రజలకు సేవలు అందిస్తున్నామని తెలియజేశారు. ఈ సమావేశంలో గుండె వైద్య నిపుణులు డాక్టర్ సాకేత్, డాక్టర్ రవికిరణ్, డాక్టర్ వాను భార్గవ్, ఆసుపత్రి మేనేజ్మెంట్ స్వామి, శ్రీనివాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News