సీఎం కేసీఆర్‌కు అస్వస్థత.. యశోదలో వైద్య పరీక్షలు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం రాజ్‌భవన్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమ కోహ్లి ప్రమాణస్వీకారానికి హాజరైన కేసీఆర్.. కార్యక్రమం అనంతరం ప్రగతి భవన్ చేరుకున్నారు. ప్రగతి భవన్ కొద్దిసేపటికే అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వ్యక్తిగత వైద్యుడు పరీక్షించి ఆస్పత్రిలో వెళ్లాలని సూచించారు. దీంతో సీఎం కేసీఆర్ మధ్యాహ్నం సికింద్రబాద్‌లోని యశోద ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్ కు ఊపిరితిత్తుల్లో మంట (lungs burning)గా ఉండడంతో బుధవారం ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎం.వి. […]
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం రాజ్‌భవన్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమ కోహ్లి ప్రమాణస్వీకారానికి హాజరైన కేసీఆర్.. కార్యక్రమం అనంతరం ప్రగతి భవన్ చేరుకున్నారు. ప్రగతి భవన్ కొద్దిసేపటికే అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వ్యక్తిగత వైద్యుడు పరీక్షించి ఆస్పత్రిలో వెళ్లాలని సూచించారు. దీంతో సీఎం కేసీఆర్ మధ్యాహ్నం సికింద్రబాద్‌లోని యశోద ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్ కు ఊపిరితిత్తుల్లో మంట (lungs burning)గా ఉండడంతో బుధవారం ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎం.వి. రావు, శ్వాసకోశ నిపుణుడు డాక్టర్ నవనీత్ సాగర్ రెడ్డి, హృద్రోగ నిపుణుడు డాక్టర్ ప్రమోద్ కుమార్ తదితరులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయనకు ఎంఆర్ఐ, సిటీ స్కాన్ పరీక్షలు చేశారు.
కాగా కేసీఆర్ కు లంగ్స్ లో మైల్డ్ ఇన్ ఫెక్షన్ ఉందని వైద్యులు ఎంవీ రావు తెలిపారు. కేసీఆర్ కు ఐదు రోజుల మెడిసిన్ ఇచ్చామని చెప్పారు. మరి కొన్ని టెస్ట్‌ల రిపోర్టులు రావాల్సి ఉందని తెలిపారు. ప్రతీ శీతాకాలంలో బ్రాంకైటిస్ సమస్య సాధారణంగా ఉంటుందని వివరించారు. కేసీఆర్‌కు ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.