మరీ ఇంత దారుణమా?.. కరోనా రోగులని కూడా చూడకుండా..

దిశ, స్టేషన్ ఘన్ పూర్: కరోనా రోగులకు వైద్య సేవలు అందించి ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. బాధ్యతాయుతంగా మెలగాల్సిన కిందిస్థాయి సిబ్బంది కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. మెడికల్ కిట్లను విసిరి వేస్తూ కరోనా రోగుల పట్ల దారుణంగా ప్రవర్తించిన ఘటన  జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానిక ఉన్నత శ్రేణి ఆరోగ్య కేంద్రంలో 74 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 28 మందికి పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో పాజిటివ్‌గా […]

Update: 2021-04-26 09:48 GMT

దిశ, స్టేషన్ ఘన్ పూర్: కరోనా రోగులకు వైద్య సేవలు అందించి ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. బాధ్యతాయుతంగా మెలగాల్సిన కిందిస్థాయి సిబ్బంది కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. మెడికల్ కిట్లను విసిరి వేస్తూ కరోనా రోగుల పట్ల దారుణంగా ప్రవర్తించిన ఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానిక ఉన్నత శ్రేణి ఆరోగ్య కేంద్రంలో 74 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 28 మందికి పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో పాజిటివ్‌గా తేలిన వారందరిని 2/3 మీటర్ల దూరంలో నిలబెట్టి మెడికల్ కిట్‌లను వైద్య అధికారులు దూరంగా విసిరి వేశారు.

కింద పడిన ఈ మెడికల్ కిట్లను తీసుకుంటూ కరోనా బాధితులు మనోవేదనకు గురయ్యారు. రోగులకు మనోధైర్యాన్ని ఇవ్వాల్సిన వైద్య సిబ్బంది ఇలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం విమర్శలకు దారితీసింది.

Tags:    

Similar News