అనుమానితులందరికీ వైద్య పరీక్షలు: కలెక్టర్‌

దిశ నల్గొండ: కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. సూర్యాపేటలోని పురపాలిక కార్యాలయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వచ్చిన సభ్యులతో ఆయన సమీక్ష జరిపారు. ఈ నేపథ్యంలో ప్రతినిధులు మరో రెండు రోజులు సూర్యాపేటలోనే ఉండి పరిస్థితిని సమీక్షించనున్నారని తెలిపారు. కొత్తగూడెం బజారు ప్రాంతంలోని మరో అర కిలోమీటరు పరిధిలోని ఇళ్లను 20 వైద్య బృందాలతో ఇంటింటి సర్వే చేయించారు. ఇక్కడ వైరస్‌ సోకిన […]

Update: 2020-04-14 06:56 GMT

దిశ నల్గొండ: కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. సూర్యాపేటలోని పురపాలిక కార్యాలయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వచ్చిన సభ్యులతో ఆయన సమీక్ష జరిపారు. ఈ నేపథ్యంలో ప్రతినిధులు మరో రెండు రోజులు సూర్యాపేటలోనే ఉండి పరిస్థితిని సమీక్షించనున్నారని తెలిపారు. కొత్తగూడెం బజారు ప్రాంతంలోని మరో అర కిలోమీటరు పరిధిలోని ఇళ్లను 20 వైద్య బృందాలతో ఇంటింటి సర్వే చేయించారు. ఇక్కడ వైరస్‌ సోకిన వ్యక్తితో ప్రైమరీ కాంటాక్టు ఉన్న 12 మందికి నెగిటెవ్‌ వచ్చినట్లు కలెక్టర్‌ వివరించారు. సోమవారం 154 కరోనా అనుమానితులను ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించామన్నారు. తమకు కూడా పరీక్షలు నిర్వహించాలంటూ.. పలువురు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు.

Tags: Collector vinay krishna, Medical examination, inspects, suryapet

Tags:    

Similar News