సంగారెడ్డి లో రూ.550 కోట్లతో మెడికల్, నర్సింగ్ కళాశాల: మంత్రి  కేటీఆర్

దిశ, సంగారెడ్డి: పట్టణాల అభివృద్ధి కోసం పట్టణ ప్రగతిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రూ.3051 కోర్టు నిధులు విడుదల చేయడం జరిగిందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం సంగారెడ్డిలోని కలెక్టరేట్ ఆవరణలో 7 వైకుంఠ రథాలు, ఆఖరి సఫర్ వాహనాలను ప్రారంభించారు. అనంతరం సంగారెడ్డి లో నూతనంగా రూ.6 కోట్ల 70 లక్షలతో నిర్మాణం చేస్తున్న వెజ్ నాన్వెజ్ సమీకృత మార్కెట్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర […]

Update: 2021-12-16 09:21 GMT

దిశ, సంగారెడ్డి: పట్టణాల అభివృద్ధి కోసం పట్టణ ప్రగతిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రూ.3051 కోర్టు నిధులు విడుదల చేయడం జరిగిందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం సంగారెడ్డిలోని కలెక్టరేట్ ఆవరణలో 7 వైకుంఠ రథాలు, ఆఖరి సఫర్ వాహనాలను ప్రారంభించారు. అనంతరం సంగారెడ్డి లో నూతనంగా రూ.6 కోట్ల 70 లక్షలతో నిర్మాణం చేస్తున్న వెజ్ నాన్వెజ్ సమీకృత మార్కెట్లకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రగతిలో 142 పట్టణ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగిందన్నారు. అదే విధంగా మున్సిపాలిటీలలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీల్లో 500 కోట్ల నిధులను కేటాయించామని తెలిపారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల అభివృద్ధికి 66 కోట్ల 12 లక్షల నిధులను విడుదల చేశామన్నారు.

సంగారెడ్డికి మెట్రో రైలు సాధ్యం కాదు..

కరోనా కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా నష్టాల్లో మునిగిపోయిందని మెట్రో రైలు నష్టాల్లో ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో రైల్ కేటాయించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరడంతో సంగారెడ్డి వరకు మెట్రో రైలు తీసుకురావడం సాధ్యం కాదన్నారు. పార్టీలకు అతీతంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. అందువల్ల ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు వారి అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులను విడుదల చేస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అసెంబ్లీలో కోరడంతో పార్టీలు చూడకుండా ప్రజల అవసరాల కోసం 550 కోట్ల తో మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల సంగారెడ్డి లో ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివరించారు .

రెండు సంవత్సరాల్లో నిర్మాణాలు పూర్తి చేసుకొని విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి బి బి పాటిల్ కలెక్టర్ హనుమంతరావు ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి మాణిక్యరావు క్రాంతి కిరణ్ మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ డీసీఎంఎస్ చైర్మన్ శివ కుమార్ డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News