బీజేపీ ఆఫీస్‌కు మీడియా డైవర్షన్.. ఎందుకంటే ?

దిశ, తెలంగాణ బ్యూరో: దశాబ్ద కాలం నుంచి మీడియా రూట్ ఒక వైపే నడిచింది. ఇప్పుడు మరో వైపు నడుస్తోంది. అనివార్యంగా మారినట్లుగా బల్దియా ఎన్నికల సందర్భంగా తెలుస్తోంది. గతంలో వందలాది మంది టీఆర్ఎస్ భవన్ ముందు పడిగాపులు కాసేవారు. ఎప్పుడు లోనికి అనుమతిస్తారోనని ఎదురుచూసే వారు. సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల ప్రెస్‌మీట్లు, బైట్స్ కోసం గంటల తరబడి ఉండాల్సి వచ్చేది. తెలంగాణ భవన్ ముందు మీడియా వాహనాలు పెద్ద ఎత్తున దర్శనమిచ్చేది. ఏమైందో […]

Update: 2020-11-29 08:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: దశాబ్ద కాలం నుంచి మీడియా రూట్ ఒక వైపే నడిచింది. ఇప్పుడు మరో వైపు నడుస్తోంది. అనివార్యంగా మారినట్లుగా బల్దియా ఎన్నికల సందర్భంగా తెలుస్తోంది. గతంలో వందలాది మంది టీఆర్ఎస్ భవన్ ముందు పడిగాపులు కాసేవారు. ఎప్పుడు లోనికి అనుమతిస్తారోనని ఎదురుచూసే వారు. సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల ప్రెస్‌మీట్లు, బైట్స్ కోసం గంటల తరబడి ఉండాల్సి వచ్చేది. తెలంగాణ భవన్ ముందు మీడియా వాహనాలు పెద్ద ఎత్తున దర్శనమిచ్చేది. ఏమైందో ఏమో గానీ.. ఇప్పుడు మీడియా రూట్ ఛేంజ్ అయినట్లుగా కనిపిస్తోంది. బంజారాహిల్స్ తెలంగాణ భవన్ దగ్గర ఉండాల్సిన మీడియా నాంపల్లి వైపు దర్శనమిస్తోంది.

బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర మీడియా ఎదురుచూపుల్లో ఉంటోంది. జాతీయ నాయకత్వం హైదరాబాద్‌కు వస్తోంది. దీంతో ఎప్పుడెవరు మీడియాతో మాట్లాడుతారోనని అక్కడే ఉంటోంది. ఆదివారం కేంద్రహోంమంత్రి అమిత్ షా రాక, మీడియా సమావేశం కోసం విలేకర్లు ఉదయం నుంచి ఆఫీసు దగ్గరే ఉన్నారు. రాష్ట్ర నాయకత్వం కూడా ఎప్పుడేం మాటల బాంబులు పేలుస్తుందోనన్న ఎదురుచూపులతో కాలం వెళ్లదీశారు. అయితే తెలంగాణ భవన్ నుంచి బీజేపీ ఆఫీసు వైపునకు మీడియా రూట్ ఎన్నాళ్లు ఉంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News