పుకార్లు, అవాస్తవాలు నమ్మొద్దు : ఎస్పీ చందన దీప్తి
దిశ, మెదక్: కరోనా లాక్‌డౌన్ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లు, కల్పిత వార్తల ద్వారా పుట్టించే అవాస్తవాలను నమ్మొద్దని మెదక్ ఎస్పీ చందన దీప్తి అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలకు సంబంధించిన ఏమైనా ఉంటే అధికారికంగా జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ప్రకటిస్తామని తెలిపారు. కరోనా వైరస్ అవగాహనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా పోలీసు యంత్రాంగం పెద్దఎత్తునా చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. కానీ కొందరు ఆకతాయిలు వార్త ఛానల్ బ్రేకింగ్ పేరుతో, కంప్యూటర్లు గ్రాఫిక్స్ తయారుచేసి […]
దిశ, మెదక్: కరోనా లాక్‌డౌన్ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లు, కల్పిత వార్తల ద్వారా పుట్టించే అవాస్తవాలను నమ్మొద్దని మెదక్ ఎస్పీ చందన దీప్తి అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలకు సంబంధించిన ఏమైనా ఉంటే అధికారికంగా జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ప్రకటిస్తామని తెలిపారు. కరోనా వైరస్ అవగాహనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా పోలీసు యంత్రాంగం పెద్దఎత్తునా చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. కానీ కొందరు ఆకతాయిలు వార్త ఛానల్ బ్రేకింగ్ పేరుతో, కంప్యూటర్లు గ్రాఫిక్స్ తయారుచేసి సామాజిక మాధ్యమాలలో పోస్టు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని ఎస్పి హెచ్చరించారు.
Tags: corona,lockdown,Medak sp,chandana deepthi,social media