నూరు శాతం వ్యాక్సినేషన్‌కు పూర్తి చేస్తాం : చైర్మెన్ రేఖాయాదగిరి
దిశ, గండిపేట్ : నార్సింగి మున్సిపల్ పరిధిలో వంద శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చైర్మెన్ రేఖాయాదగిరి తెలిపారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని గౌలిదొడ్డి, వట్టినాగులపల్లి, 1, 2 వ వార్డులలో చైర్మెన్ రేఖాయాదగిరి ఆధ్వర్యంలో వ్యాక్సిన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చైర్మెన్ మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధిలో కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేలా చూస్తున్నామన్నారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతేకాకుండా మున్సిపాలిటీలో వ్యాక్సినేషన్ […]
దిశ, గండిపేట్ : నార్సింగి మున్సిపల్ పరిధిలో వంద శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చైర్మెన్ రేఖాయాదగిరి తెలిపారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని గౌలిదొడ్డి, వట్టినాగులపల్లి, 1, 2 వ వార్డులలో చైర్మెన్ రేఖాయాదగిరి ఆధ్వర్యంలో వ్యాక్సిన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చైర్మెన్ మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధిలో కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేలా చూస్తున్నామన్నారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అంతేకాకుండా మున్సిపాలిటీలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి స్థాయిలో చేపట్టేలా చొరవ చూపుతున్నామన్నారు. వ్యాక్సిన్ తీసుకోని వారు ఇప్పటికైనా వ్యాక్సిన్ చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్, కౌన్సిలర్ కిషోర్ యదమ్మ, కో-ఆప్షన్స్ సభ్యులు మహమ్మద్, నాయకులు రాజు, మాజీ మండల యాత్ ప్రసిడెంట్ వేణుగోపాల్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు విష్ణు, గణేష్ సింగ్, మున్సిపల్ బిల్ కలెక్టర్ పాషా, సానిటేషన్ లచ్చిరాం తదితరులు పాల్గొన్నారు.