డొమెస్టిక్ ఫ్లైట్స్‌లో మీల్స్‌పై ఆంక్షలు
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఉధృతమవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం దేశీయ విమానాల్లో ఆన్ బోర్డు మీల్స్‌పై ఆంక్షలు కఠినం చేసింది. డొమెస్టిక్ ఫ్లైట్స్‌లో రెండు గంటల వ్యవధికి మించి ప్రయాణించే వారికి మాత్రమే ఆన్‌బర్డు మీల్స్ సేవలను అందించాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ సోమవారం ఆదేశించింది. రెండు గంటల లోపు జర్నీ ఉన్న ప్రయాణికులకు ఆన్‌బోర్డు మీల్స్ నిషేధించాలని తెలిపింది. ఈ బ్యాన్ గురువారం నుంచి అమలు చేయనున్నట్టు వివరించింది. గతేడాది లాక్‌డౌన్ నిబంధనలు సడలింపులతో […]
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఉధృతమవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం దేశీయ విమానాల్లో ఆన్ బోర్డు మీల్స్‌పై ఆంక్షలు కఠినం చేసింది. డొమెస్టిక్ ఫ్లైట్స్‌లో రెండు గంటల వ్యవధికి మించి ప్రయాణించే వారికి మాత్రమే ఆన్‌బర్డు మీల్స్ సేవలను అందించాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ సోమవారం ఆదేశించింది. రెండు గంటల లోపు జర్నీ ఉన్న ప్రయాణికులకు ఆన్‌బోర్డు మీల్స్ నిషేధించాలని తెలిపింది. ఈ బ్యాన్ గురువారం నుంచి అమలు చేయనున్నట్టు వివరించింది. గతేడాది లాక్‌డౌన్ నిబంధనలు సడలింపులతో దేశీయ విమాన సేవలు మళ్లీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి కొన్ని ఆంక్షలతో ఆన్‌బోర్డు మీల్స్‌కు కేంద్రం అనుమతినిచ్చింది. ఈ ఆంక్షల ఉత్తర్వలను సవరిస్తూ తాజాగా ఆదేశాలను జారీ చేసింది.