29న ఎంబీబీఎస్ వెబ్ కౌన్సెలింగ్
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రైవేట్ మెడికల్ కళాశాల్లో ప్రవేశాలకు తుది విడత కౌన్సిలింగ్ (మాప్ అప్) నోటిఫికేషన్‌ను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసింది. మిగిలిపోయిన సీట్ల భర్తీకి మాప్ అప్ నోటిఫికేషన్ విడుదల చేసిన యూనివర్సిటీ ఈనెల 29న ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని సూచించింది. యూనివర్సిటీ విడుదల చేసిన తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని […]
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రైవేట్ మెడికల్ కళాశాల్లో ప్రవేశాలకు తుది విడత కౌన్సిలింగ్ (మాప్ అప్) నోటిఫికేషన్‌ను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసింది. మిగిలిపోయిన సీట్ల భర్తీకి మాప్ అప్ నోటిఫికేషన్ విడుదల చేసిన యూనివర్సిటీ ఈనెల 29న ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని సూచించింది. యూనివర్సిటీ విడుదల చేసిన తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు. గత విడత కౌన్సెలింగ్‌లో సీటు అలాట్ అయి జాయిన్ కానీ అభ్యర్థులు, అదే విధంగా కళాశాలలో చేరి డ్రాప్ అయిన విద్యార్థులు ఈ విడత వెబ్ కౌన్సెలింగ్‌కు అనర్హులుగా పరిగణించబడుతారు. ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ కింద ఇప్పటికే చేరిన అభ్యర్థులను కూడా ఈ వెబ్ కౌన్సెలింగ్‌కు అనర్హులుగా పరిగణిస్తారని తెలిపారు. ఇతర వివరాలకు www.knruhs.telangana.gov .in వెబ్ సైట్లో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు సూచించారు.