త్వరలోనే MBBS ప్రవేశాలు..
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మరో రెండు, మూడ్రోజుల్లోనే MBBS ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆలిండియా స్థాయి ర్యాంకుల ప్రకటన అనంతరం డొమిసిల్ అభ్యర్థుల ర్యాంకులను కూడా NTA విడుదల చేసింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ (NEET)లో తెలంగాణ నుంచి 28,093 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. తెలంగాణ డొమిసిల్‌కు సంబంధించిన ర్యాంకులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) శుక్రవారం విడుదల చేసింది. జాతీయ స్థాయిలో మూడో ర్యాంకును మన రాష్ట్రానికి చెందిన […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మరో రెండు, మూడ్రోజుల్లోనే MBBS ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆలిండియా స్థాయి ర్యాంకుల ప్రకటన అనంతరం డొమిసిల్ అభ్యర్థుల ర్యాంకులను కూడా NTA విడుదల చేసింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ (NEET)లో తెలంగాణ నుంచి 28,093 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
తెలంగాణ డొమిసిల్‌కు సంబంధించిన ర్యాంకులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) శుక్రవారం విడుదల చేసింది. జాతీయ స్థాయిలో మూడో ర్యాంకును మన రాష్ట్రానికి చెందిన తమ్మల స్నికిత సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.. తెలంగాణ నుంచి టాప్-50 ర్యాంకుల జాబితాను ఎన్‌టీఏ విడుదల చేయగా.. కె. సాయి కుమార్ నీట్ 715 ర్యాంకుతో 50వ స్థానంలో నిలిచారు. రాష్ట్రం నుంచి ఆలిండియా 100లోపు 11 మంది ర్యాంకులు సాధించారు. ర్యాంకుల ప్రకటన పూర్తవడంతో రెండు, మూడ్రోజుల్లో రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల ప్రక్రియ మొదలు కానుందని తెలుస్తోంది.