సెక్రటేరియట్​ కూల్చివేతపై స్పందించిన మేయర్​

దిశ, న్యూస్​బ్యూరో: సచివాలయ కూల్చివేతపై ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో జీహెచ్​ఎంసీ మేయర్​ బొంతు రామ్మోహన్​ స్పందించారు. హైదరాబాద్​ అభివృద్ధిపై ప్రతిపక్షాలు కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయం కూల్చివేతతో ప్రార్థనా మందిరాలు దెబ్బతిన్నాయని, దాన్ని కూడా రాజకీయాల కోసం వాడుకుంటుండటం బాధకరమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్‌లో అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రార్థన మందిరాలను కూల్చారని బీజేపీ నేతలకు గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు కూడాప్రార్థన మందిరాలను కూల్చారని, చరిత్రను ప్రతిపక్ష […]

Update: 2020-07-11 10:56 GMT

దిశ, న్యూస్​బ్యూరో: సచివాలయ కూల్చివేతపై ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో జీహెచ్​ఎంసీ మేయర్​ బొంతు రామ్మోహన్​ స్పందించారు. హైదరాబాద్​ అభివృద్ధిపై ప్రతిపక్షాలు కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయం కూల్చివేతతో ప్రార్థనా మందిరాలు దెబ్బతిన్నాయని, దాన్ని కూడా రాజకీయాల కోసం వాడుకుంటుండటం బాధకరమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్‌లో అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రార్థన మందిరాలను కూల్చారని బీజేపీ నేతలకు గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు కూడాప్రార్థన మందిరాలను కూల్చారని, చరిత్రను ప్రతిపక్ష పార్టీల నాయకులు మరవకూడదని సూచించారు. సెక్రటేరియట్​ కూల్చివేతను అడ్డుగా పెట్టుకుని మళ్లీ మత ఘర్షణలు సృష్టించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయని మేయర్​ ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌పై కుట్రల రాజకీయం చేయొద్దన్నారు. సచివాలయంలో ఘటనలపై మత పెద్దలతో చర్చించామని, ప్రార్థన మందిరాల పునర్నిర్మాణంపై ముఖ్యమంత్రి కూడా స్పందించారని గుర్తు చేశారు.

Tags:    

Similar News