దాతృత్వంలో మనమే సాటి !
దిశ, న్యూస్ బ్యూరో: పేదవారి ఆకలి తీరుస్తూ.. దాతృత్వాన్ని చాటడంలో హైదరాబాద్ ఆదర్శంగా నిలుస్తోందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్ నందు గుజరాతి సేవా మండలి ఆధ్వర్యంలో నెలకొల్పిన సెంట్రల్ కిచెన్‌ను ఆయన సందర్శించారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రతిరోజు 5 వేల మందికి ఉచితంగా భోజనం పెడుతున్న గుజరాతి సమాజాన్ని మేయర్ అభినందించారు. ‘ఆకలితో ఏ ఒక్కరూ ఇబ్బందిపడరాదని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారని’ గుర్తుచేశారు. నిరుపేదలు, వలస కూలీలతో పాటు […]
దిశ, న్యూస్ బ్యూరో: పేదవారి ఆకలి తీరుస్తూ.. దాతృత్వాన్ని చాటడంలో హైదరాబాద్ ఆదర్శంగా నిలుస్తోందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్ నందు గుజరాతి సేవా మండలి ఆధ్వర్యంలో నెలకొల్పిన సెంట్రల్ కిచెన్‌ను ఆయన సందర్శించారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రతిరోజు 5 వేల మందికి ఉచితంగా భోజనం పెడుతున్న గుజరాతి సమాజాన్ని మేయర్ అభినందించారు. ‘ఆకలితో ఏ ఒక్కరూ ఇబ్బందిపడరాదని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారని’ గుర్తుచేశారు. నిరుపేదలు, వలస కూలీలతో పాటు కరోనా వైరస్ నియంత్రణకు శ్రమిస్తున్న క్షేత్రస్థాయి పోలీసులు, ఇతర సిబ్బందికి ఆహార ప్యాకెట్లను అందిస్తున్నారని ప్రశంసించారు. ఈ సందర్భంగా వృద్ధులు, నిరాశ్రయులకు ఆహార ప్యాకెట్లు, నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ పర్యటనలో రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర గుప్తా, గుజరాతి సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు ఘనశ్యాం దాస్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
Tags : GHMC Mayor, CM KCR, Food Packets, Gujarati Seva Mandali